పెరుగుతున్న గ్యాస్ ధరలకు కళ్లెం వేయడానికి, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్యాచరణకు దిగింది. ఇందులో భాగంగా క్యాబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతేకాదు గ్యాస్ ధరలను కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త ఫార్ములాను ఆమోదించింది,

సామాన్య ప్రజలకు గ్యాస్ సిలిండర్ విషయంలో అతి పెద్ద ఉపశమనం లభించబోతోంది. ధరలను నియంత్రించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొత్త ఫార్ములాను ఆమోదించింది, దీని కారణంగా CNG, PNG ధరలు త్వరలో 10 శాతం వరకు తగ్గవచ్చు. ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. APM గ్యాస్ కోసం ఒక MMBtu (Metric Million British Thermal Unit) కి 4 డాలర్ల బేస్ ధర MMBtuకి 6.5 డాలర్ల సీలింగ్ ధరను క్యాబినెట్ ఆమోదించింది. ఈ పరిమితి రెండేళ్లపాటు ఉంటుందని, ఆ తర్వాత ప్రతి ఏడాది MMBtuకు 0.25 డాలర్ల చొప్పున పెంచుతామని మంత్రి తెలిపారు. కిరీట్ పారిఖ్ నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల ఆధారంగా గ్యాస్ ధర ఫార్ములాలో మార్పులు జరిగాయి.

క్యాబినెట్ సమావేశ నిర్ణయాలను తెలియజేస్తూ, దేశీయ సహజవాయువు ధరల కొత్త ఫార్ములాను ప్రభుత్వం ఆమోదించిందని సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీనితో పాటు, CNG పైప్డ్ వంట గ్యాస్ ధరలపై సీలింగ్ నిర్ణయించారు. ఈ పరిమితి 2 సంవత్సరాల వరకు వర్తిస్తుంది. APM గ్యాస్‌కు ఒక mmBtuకు 4 డాలర్ల బేస్ ధరను కేబినెట్ ఆమోదించిందని ఠాకూర్ తెలియజేశారు. దీనితో పాటు, ఒక mmbtuకు గరిష్ట ధర 6.5 డాలర్ల వద్ద ఉంచడంపై సీల్ నిర్దేశించారు. 

ధరలు ఎంత తగ్గుతాయి

ఈ నిర్ణయం తర్వాత ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.79.56 నుంచి రూ.73.59కి, పీఎన్‌జీ ధర వెయ్యి క్యూబిక్ మీటర్లకు రూ.53.59 నుంచి రూ.47.59కి తగ్గనుంది. ముంబైలో సీఎన్‌జీ ధర రూ.87కి బదులుగా రూ.79, పీఎన్‌జీ ధర రూ.54కి బదులుగా రూ.49గా ఉంది.

ధరలు క్రూడ్‌తో ముడిపడి ఉంటాయి

సమాచారం ఇస్తూ, కొత్త ఫార్ములా ప్రకారం, దేశీయ సహజ వాయువు ధర ఇప్పుడు అంతర్జాతీయ హబ్ గ్యాస్‌కు బదులుగా దిగుమతి చేసుకున్న ముడి చమురుతో ముడిపడి ఉంటుందని ఠాకూర్ చెప్పారు. దేశీయ గ్యాస్ ధర ఇప్పుడు భారత క్రూడ్ బాస్కెట్ ప్రపంచ ధర నెలవారీ సగటులో 10 శాతం ఉంటుంది. ఇది ప్రతి నెలా తెలియజేస్తారు. దీనివల్ల పీఎన్‌జీ, సీఎన్‌జీ, ఫర్టిలైజర్ ప్లాంట్లు తదితరాలు ప్రయోజనం పొందుతాయి. దీని వల్ల సాధారణ గృహ వినియోగదారులు, రైతులు, డ్రైవర్లు నేరుగా ప్రయోజనం పొందుతారు. భారతీయ బాస్కెట్‌లో ముడి చమురు ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 85 డాలర్లు ఇందులో 10 శాతం 8.5 డాలర్లు, అయితే, ధరల పరిమితి కారణంగా, ONGC ఆయిల్ ఇండియా లిమిటెడ్ APM గ్యాస్‌కు mmBtu ధరకు 6.5 డాలర్లు మాత్రమే పొందుతాయి.