దేశంలో ఇంధన ధరలు వరుసగా రెండో  రోజు కూడా మళ్ళీ పెరిగాయి. సుమారు 40 రోజుల  తరువాత  ఆదివారం పెట్రోలు ధరలు ఊపందుకున్నాయి. దేశ  రాజధాని  ఢిల్లీతో పాటు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు పెరిగాయి.

ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు 16 పైసలు, హైదరాబాదులో 14 పైసలు పెరగ్గా, డీజిల్ ధర యథాతథంగా ఉంది. అంతకుముందు రోజు లీటరుకు రూ.80.57, ముంబైలో రూ.87.45 డాలర్లకు పెరిగింది. అంతకుముందు లీటరుకు రూ.87.31 ఉంది.

           పెట్రోల్   డీజిల్
ఢిల్లీ      80,73   73,56
కోలకతా 82,30   77,06

also read  టిక్‌టాక్‌ బ్యాన్ తరువాత అమెరికా నెక్స్ట్ టార్గెట్ అలీబాబా.. ? ...


ముంబై  87,45   80,11
చెన్నై    83,87   78,86

ముడి చమురు, విదేశీ మారక రేట్లు వంటి కారణాల వల్ల ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంధన ధరలు మారుతూ ఉంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం మూడు ప్రభుత్వ చమురు మార్కెటింగ్ సంస్థలు దేశంలో పెట్రోల్, డీజిల్ బంకుల్లో ఎక్కువ భాగం కలిగి ఉన్నాయి.

ఈ మూడు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి ఇంధన ధరలలో ఏవైనా సవరణలను ఉంటే అమలు చేస్తాయి. నేడు బ్రెంట్ ముడి చమురు 21 సెంట్లు లేదా 0.5 శాతం పెరిగి 45.01 డాలర్లకు చేరుకోగా, యు.ఎస్. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ ముడి చమురు 27 సెంట్లు లేదా 0.6 శాతం పెరిగి బ్యారెల్ 42.28 డాలర్లకు చేరుకుంది. హైదరాబాద్ పెట్రోలు 83.93, డీజీల్  80.17రూపాయలు .