దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా కొనసాగుతోంది. నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96గా ఉంది.
ఇండియన్ ఆయిల్ కంపెనీలు ఈరోజు అంటే శుక్రవారం 4న ఉదయం పెట్రోల్, డీజిల్ తాజాగా ధరలను అప్‌డేట్ చేశాయి. దీంతో జాతీయ మార్కెట్‌లో నేటికీ ఇంధనం (పెట్రోల్-డీజిల్) ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. నేడు కూడా దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్ డీజిల్ ధర రూ.89.62గా కొనసాగుతోంది. నోయిడాలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.79, డీజిల్ ధర రూ.89.96గా ఉంది. ఘజియాబాద్‌లో లీటరు పెట్రోల్‌ను రూ.96.58గా, డీజిల్ ధర లీటర్‌కు రూ.89.75 వద్ద స్థిరంగా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.97.18, డీజిల్ ధర లీటరుకు రూ.90.05గా ఉంది.
మే 22న చమురు ధరలు
క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయిన తర్వాత కూడా దేశీయ మార్కెట్‌లో పెట్రోల్-డీజిల్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇంధన ధరలో చివరి మార్పు మే 22న జరిగింది. ఐదు నెలలకు పైగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉండడం ఇదే తొలిసారి. మే 22న కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు దిగోచ్చాయి.
ఈ మెట్రో నగరాల్లో
చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.63గా, డీజిల్ ధర లీటరుకు రూ.94.24గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర 106.03, డీజిల్ ధర లీటరుకు రూ.92.76గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31గా, డీజిల్ లీటరు రూ.94.27. హైదరాబాద్ లో పెట్రోలు ధర లీటరుకు రూ. 109.66, డీజిల్ ధర లీటరుకు రూ. 97.82
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ఆధారంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సమీక్షించిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలను నిర్ణయిస్తాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం మరియు హిందుస్థాన్ పెట్రోలియం ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం వివిధ నగరాల పెట్రోల్ , డీజిల్ ధరల సమాచారాన్ని అప్‌డేట్ చేస్తాయి. రాష్ట్ర స్థాయి పన్ను కారణంగా వివిధ రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి.
