ఈ రోజు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $1.19 లేదా 1.5 శాతం పెరిగి $82.78 డాలర్లకి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) 96 సెంట్లు లేదా 1.3 శాతం పెరిగి $76.68 డాలర్ల వద్ద ఉంది.  

న్యూఢిల్లీ: నేడు పెట్రోల్‌, డీజిల్‌ కొత్త ధరలను ప్రభుత్వ చమురు సంస్థలు విడుదల చేశాయి. దీంతో సోమవారం కూడా  పెట్రోలు-డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నైలలో వంటి మెట్రో నగరాలలో ధరలు మారలేదు.

 బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు $1.19 లేదా 1.5 శాతం పెరిగి $82.78 డాలర్లకి చేరుకోగా, US వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ (WTI) 96 సెంట్లు లేదా 1.3 శాతం పెరిగి $76.68 డాలర్ల వద్ద ఉంది.

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర లీటరుకి రూ. 89.62. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31కి, డీజిల్ ధర రూ.94.27. చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.63, డీజిల్ ధర రూ.94.24. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉన్నాయి.

సౌదీ అరేబియా ఆయిల్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీ ఇంకా ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అత్యంత విలువైన కంపెనీ 2022లో $161 బిలియన్ల కంటే ఎక్కువ లాభాలను నమోదు చేసింది.

సాధారణంగా సౌదీ అరామ్‌కోగా పిలవబడే ఆయిల్ అండ్ గ్యాస్ దిగ్గజం లాభాలు 2021లో $110 బిలియన్ల నుండి దాదాపు 50 శాతం పెరిగి 2022లో రికార్డు స్థాయిలో $161.1 బిలియన్లకు చేరుకున్నాయని కంపెనీ మార్చి 12న ప్రకటించింది.

మార్చి 13న భారతదేశంలోని వివిధ నగరాల్లో ఇంధన ధరలు:

బెంగళూరు

పెట్రోలు: లీటరుకు రూ. 101.94

డీజిల్: లీటరుకు రూ. 87.89

లక్నో

పెట్రోలు: లీటరుకు రూ. 96.57

డీజిల్: లీటరుకు రూ. 89.76

భోపాల్

పెట్రోలు: లీటరుకు రూ. 108.65

డీజిల్: లీటరుకు రూ. 93.90

గాంధీ నగర్

పెట్రోలు: లీటరుకు రూ. 96.63

డీజిల్: లీటరుకు రూ. 92.38

హైదరాబాద్

పెట్రోలు: లీటరుకు రూ. 109.66

డీజిల్: లీటరుకు రూ. 97.82

తిరువనంతపురం

పెట్రోలు: లీటరుకు రూ. 107.71

డీజిల్: లీటరుకు రూ. 96.52

ఇంతకుముందు ప్రతి పక్షం రోజులకు ఒకసారి పెట్రోల్, డీజిల్ ధరలు సవరించబడతాయి, అంటే ప్రతి నెల 1వ ఇంకా 16వ తేదీల్లో పెట్రోల్ ధర, డీజిల్ ధర మారుతుంది. అయితే, జూన్ 2017 నుండి దీని కింద కొత్త పథకం అమలు చేయబడింది. అప్పటి నుండి పెట్రోల్ ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు సవరించబడుతున్నాయి.

మీ నగరంలో పెట్రోల్-డీజిల్ తాజా ధరలు ఎలా చెక్ చేయాలంటే
కస్టమర్లు పెట్రోల్ పంప్ “RSP <space> డీలర్ కోడ్ ని 9224992249కి టెక్స్ట్ మెసేజ్ పంపడం ద్వారా పెట్రోల్, డీజిల్ తాజా ధరలను చెక్ చేయవచ్చు.