ఐపీఎల్ 2022 సీజన్ మరి కొద్దిరోజుల్లోనే ప్రారంభం కానుంది. ఐపీఎల్ మ్యాచ్‌లను ఎటువంటి ఆటంకం లేకుండా వీక్షించాలనుకుంటున్నారా..! డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందించే మొబైల్ ప్లాన్స్ ఇవే..!  

ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి మరి కొద్దిరోజులు మాత్రమే మిగిలింది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు అంతరాయం లేకుండా నిరంతరం చూడాలనుకునేవారికి ఇది గుడ్‌న్యూస్. డిస్నీ హాట్‌స్టార్ ఓటీటీ ఉచిత సబ్‌స్క్రిప్షన్ కోసం వివిధ టెలికాం కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియాలు అందించే ఆ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.

రిలయన్స్ జియో డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్స్

ఇందులో 28 రోజుల వ్యాలిడిటీతో 601 రూపాయలకు, రోజుకు 3 జీబీ డేటాతో పాటు ఒక ఏడాది వ్యవధి కోసం డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా అందుతుంది. ఇందులో రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, అపరిమితమైన వాయిస్ కాల్స్ సౌకర్యం ఉంటుంది. ఇక నెలకు 499 రూపాయల ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడీటీతో రోజుకు 2 జీబీ డేటా అందుతుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. ఏడాది కాల వ్యవధికి డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా అందుతుంది.

వోడాఫోన్ ఐడియా డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్స్

ఇందులో కూడా నెలకు 601 రూపాయల ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా 28 రోజుల కాలవ్యవధికి వర్తిస్తుంది. అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. దీంతోపాటు ఏడాది కాల వ్యవధికి డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఉచితంగా అందుతుంది. ఇక మరో ప్లాన్ 901 రూపాయలకు 70 రోజుల కాలవ్యవధికి వర్తిస్తుంది. ఇందులో కూడా రోజుకు 3 జీబీ డేటాతో పాటు డిస్నీ హాట్‌స్టార్ మొబైల్ ఎడిషన్ ఏడాది వ్యవధికి అందుతుంది. అంతేకాదు..అదనంగా 16 నుంచి 48 జీబీ డేటా లభిస్తుంది. 

ఎయిర్‌టెల్ డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్స్

ఇందులోనెలకు 599 రూపాయల ప్లాన్‌లో భాగంగా 28 రోజుల కాలవ్యవధికి రోజుకు 3 జీబీ డేటా, అపరిమితమైన వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు ఉంటాయి. మరోవైపు నెలకు 838 రూపాయల ప్లాన్‌తో రోజుకు 2 జీబీ డేటా 56 రోజుల కోసం అందుబాటులో ఉంది. ఈ రెండు ప్లాన్స్‌లో ఏడాది వ్యవధికి డిస్నీ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందుతుంది. అటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ నెల రోజుల కోసం అందుతుంది. ఇంకెందుకు ఆలస్యం..వెంటనే మీ మీ మొబైల్ ఫోన్స్ ఈ ప్లాన్స్ ప్రకారం రీఛార్జ్ చేసుకుని..ఐపీఎల్ మ్యాచ్‌లు ఆనందంగా వీక్షించండి.