ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డిఐ) 15 శాతం పెరిగి 30 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ సమాచారం అధికారిక గణాంకాల ద్వారా వెల్లడైంది.

డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ప్రమోషన్ (డిపిఐఐటి) గణాంకాల ప్రకారం 2019-20 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎఫ్‌డిఐ 26 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది జూలై నాటికి ఇండియా 17.5 బిలియన్ డాలర్ల ఎఫ్‌డిఐ పొందింది. 

2020-21 ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో ఎక్కువ ఎఫ్‌డిఐలను ఆకర్షించిన రంగాలలో కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ అండ్ హార్డ్‌వేర్ 17.55 బిలియన్ డాలర్లు, సర్వీసెస్ 2.25 బిలియన్ల డాలర్లు, ట్రేడింగ్ 49 మిలియన్ల డాలర్లు, రసాయనాలు 43.7 మిలియన్ల డాలర్లు, ఆటోమొబైల్స్ 41.7 మిలియన్ల డాలర్లు. సింగపూర్ ఎఫ్‌డి‌ఐ అతిపెద్ద వనరుగా మారింది.

also read జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ 7.5 శాతం డౌన్.. వృద్ధిరేటుపై ఆర్‌బిఐ తాజా అంచ‌నా.. ...

 సింగపూర్ 8.3 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారతదేశంలో అతిపెద్ద ఎఫ్‌డి‌ఐ వనరుగా అవతరించింది. దాని తరువాత యునైటెడ్ స్టేట్స్ 7.12 బిలియన్ డాలర్లు, కేమాన్ ఐలాండ్ 2.1 బిలియన్ డాలర్లు, మారిషస్ 2 బిలియన్ డాలర్లు, నెదర్లాండ్స్ 1.5 బిలియన్ డాలర్లు, బ్రిటన్ 1.35 బిలియన్ డాలర్లు, ఫ్రాన్స్ 1.13 బిలియన్ డాలర్లు, జపాన్ 65.3 మిలియన్ డాలర్లు. విదేశీ కంపెనీల ఆదాయంలో రి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ద్వారా మొత్తం ఎఫ్‌డిఐలు 40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని డిపిఐఐటి తెలిపింది.

2004 నుండి 2015 మధ్య కొత్త విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రాజెక్టులను ఆకర్షించే నాల్గవ ప్రధాన దేశంగా భారత్ నిలిచింది. ఈ కాలంలో ఇతర దేశాలలో విలీనాలు, సముపార్జనలలో భారతదేశం ఎనిమిదో స్థానంలో ఉంది.  

ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ వెబ్‌సైట్‌లో లభించిన నివేదిక ప్రకారం 2004 నుండి 2015 మధ్యకాలంలో భారతదేశం 8,004 కొత్త ఎఫ్‌డిఐ ప్రాజెక్టులను అందుకుంది. విలీనాలు మరియు సముపార్జనల సంఖ్య కూడా 4,918గా ఉంది.

ఈ కాలంలో కొత్త ఎఫ్‌డిఐ ప్రాజెక్టులను సొంతం చేసుకోవడంలో అమెరికా అగ్రస్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. చైనా రెండవ స్థానంలో, బ్రిటన్ మూడవ స్థానంలో నిలిచింది. ఈ కాలంలో అమెరికాకు 13,308 కొత్త ఎఫ్‌డిఐ ప్రాజెక్టులు వచ్చాయి.