Asianet News TeluguAsianet News Telugu

కేరళ విలయం: 6నెలల్లో టైర్ల ధరలు పైపైకే...

కనివినీ ఎరుగని రీతిలో కేరళను ముంచెత్తిన వరదలతో రబ్బర్, ఇతర పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడనున్నది. విదేశాల నుంచి ఐదు లక్షల టన్నుల రబ్బర్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Floods hit rubber output in Kerala, M'sian exports may rise
Author
Trivandrum, First Published Aug 20, 2018, 8:24 AM IST

ముంబై: ప్రకృతి ప్రకోపానికి కేరళ విలవిలలాడుతున్నది. పారిశ్రామిక రంగంపై జల విలయం ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా రబ్బర్ ఉత్పత్తికి విఘాతం ఏర్పడుతున్నది. దేశీయ సహజ రబ్బర్ ఉత్పత్తిలో దాదాపు 92 శాతం కేరళ నుంచే జరుగుతున్నది. ఎడాపెడా కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన వరదలకు రబ్బర్ చెట్లపై విరుచుకు పడుతున్నది. 

రబ్బర్ తోటలకు ఇలా భారీ నష్టం


కొట్టాయం, పథనంతిట్ట ప్రాంతాల్లో రబ్బర్ చెట్లకు భారీ నష్టం కలిగింది. దీంతో లక్షల ఎకరాల్లో వృక్షాలు నేలకొరిగాయి. చెట్లు నీటమునగడంతో రబ్బర్ తయారీ కోసం పెట్టిన ఏర్పాట్లన్నీ దెబ్బ తిన్నాయి. ఫలితంగా టైర్లు, ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ సంక్షోభంలో పడింది. డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక మార్కెట్‌లో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రబ్బర్ అవసరాలను విదేశీ దిగుమతుల ద్వారా టైర్ల తయారీ సంస్థలు తీర్చుకున్నా.. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పతనమైన నేపథ్యంలో ఇవి భారంగా మారతాయి. ఈ క్రమంలో టైర్ల ధరలు పెరుగడం ఖాయమన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తున్నది. రబ్బర్ ఆధారిత సంస్థల ఆదాయం కూడా క్షీణించే వీలున్నదన్న అంచనాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.5 శాతం రబ్బర్ దిగుబడి తగ్గుతుందని కోచి రబ్బర్ మర్చంట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎన్ రాధాక్రుష్ణన్ చెప్పారు. వచ్చే మార్చి నాటికి ముగిసే నాటికి రబ్బర్ ఉత్పత్తి ఆరు లక్షల టన్నుల దిగుబడి తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

జూలై నుంచే పడిపోయిన రబ్బర్ ఉత్పత్తి


జూలై నెలలో కురిసిన భారీ వర్షాలతో రబ్బర్ ఉత్పత్తి పడిపోయింది. ఆగస్టులో కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. రబ్బర్ రైతులు మళ్లీ అదే చెట్లను పెంచేందుకు సాహసించబోరని ఇండియన్ ఆటోమోటివ్ టైర్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ భుద్రాజా చెప్పారు. దీని ప్రభావంతో దేశీయంగా టైర్ల ఉత్పత్తికి భారీగా డిమాండ్ ఉండటంతో రికార్డు స్థాయిలో ఐదు లక్షల టన్నుల రబ్బర్ దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. భారీగా దిగుమతులు పెరగడం వల్ల అంతర్జాతీయంగా రబ్బర్ ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. అత్యధికంగా థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, వియత్నాం తదితర దేశాల నుంచే రబ్బర్ దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందని రాజీవ్ భుద్రాజా వివరించారు. 

కొబ్బరి, కాఫీ, తేయాకు, యాలకుల పంటకూ దెబ్బే


భారీ వర్షాల కారణంగా కొబ్బరి, తేయాకు, కాఫీ, యాలకుల పంటకూ తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం ప్లాంటేషన్ (తోటలకు) నష్ట తీవ్రత సుమారు రూ.1,000 కోట్లుగా ఉండొచ్చని అసోసియేషన్ ఆఫ్ ప్లాంటర్స్ ఆఫ్ కేరళ (ఏపీకే) ప్రాథమికంగా అంచనా వేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు ఇంకా కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం ఇప్పుడు ప్లాంటేషన్ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నది. వరదల ధాటికి ప్లాంటేషన్ మౌలిక సదుపాయాలు, ఇతరత్రా సౌకర్యాలు బాగా దెబ్బతిన్నాయని ఏపీకే కార్యదర్శి అజిత్ బాలకృష్ణన్ తెలిపారు. వందల ఎకరాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయని అన్నారు. 

తోటలకు రూ.1000 కోట్ల వరకు నష్టం


భారీ వర్షాలతో కొబ్బరి, తేయాకు, కాఫీ, యాలకుల పంటకూ తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటిదాకా మొత్తం ప్లాంటేషన్ (తోటలకు) నష్ట తీవ్రత సుమారు రూ.1,000 కోట్లుగా ఉండొచ్చని అసోసియేషన్ ఆఫ్ ప్లాంటర్స్ ఆఫ్ కేరళ (ఏపీకే) ప్రాథమికంగా అంచనా వేసింది. రాబోయే రోజుల్లో వర్షాలు ఇంకా కురుస్తాయన్న వాతావరణ శాఖ సమాచారం ఇప్పుడు ప్లాంటేషన్ పరిశ్రమకు గుబులు పుట్టిస్తున్నది. వరదల ధాటికి ప్లాంటేషన్ మౌలిక సదుపాయాలు, ఇతరత్రా సౌకర్యాలు బాగా దెబ్బతిన్నాయని ఏపీకే కార్యదర్శి అజిత్ బాలకృష్ణన్ తెలిపారు. వందల ఎకరాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. ఒక్క తేయాకు రంగానికే రూ.200 కోట్ల నష్టం రావొచ్చన్నారు. 

తేయాకు రంగానికే రూ.200 కోట్ల నష్టం


ఒక్క తేయాకు రంగానికే రూ.200 కోట్ల నష్టం రావొచ్చని అంచనా. ఇడుక్కి, వాయనాడ్ జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రబ్బరు, కాఫీ, యాలకుల పంటకు పెద్ద ఎత్తున నష్టం కలిగిందని అసోసియేషన్ ఆఫ్ ప్లాంటర్స్ ఆఫ్ కేరళ (ఏపీకే)  కార్యదర్శి అజిత్ బాలకృష్ణన్చెప్పారు. ఈ పరిశ్రమలపై ఆధారపడ్డ కుటుంబాలకు ఉపాధి కరువయ్యే వీలుందన్న ఆందోళన కనబరుస్తున్న ఏపీకే.. ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తున్నది. కేరళ ప్లాంటేషన్ రంగం విలువ గతేడాది దాదాపు రూ.9,780 కోట్లు. ఇందులో టీ తోటల వాటా 15-20 శాతంగా ఉంటే, కొబ్బరి, కాఫీ, తేయాకు, యాలకుల పంటకూ దెబ్బే.

తోటలపై ఆధార పడ్డ కుటుంబాలకు ఉపాధి కరువే


ఇడుక్కి, వాయనాడ్ జిల్లాల్లో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు రబ్బర్, కాఫీ, యాలకుల పంటకు పెద్ద ఎత్తున నష్టం కలిగింది. ఈ పరిశ్రమలపై ఆధారపడ్డ కుటుంబాలకు ఉపాధి కరువయ్యే వీలుందన్న ఆందోళనను కనబరుస్తున్న ఏపీకే.. ఎప్పటికప్పుడు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదిస్తున్నది. కేరళ ప్లాంటేషన్ రంగం విలువ గతేడాది దాదాపు రూ.9,780 కోట్లు. ఇందులో టీ తోటల వాటా 15-20 శాతంగా ఉంటే, యాలకుల వాటా 20 శాతం, రబ్బరు వాటా 10 శాతంగా ఉన్నది. దేశ జీడీపీలో కేరళ రాష్ట్ర జీడీపీ దాదాపు 4 శాతంగా ఉన్నది.
యాలకుల వాటా 20 శాతం, రబ్బరు వాటా 10 శాతంగా ఉన్నది. దేశ జీడీపీలో కేరళ రాష్ట్ర జీడీపీ దాదాపు 4 శాతం.

ఇలా పరిశ్రమల ఆపన్న హస్తం


పది రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో నీటమునిగిన కేరళకు మేమున్నాం అంటూ వ్యాపార, పారిశ్రామిక రంగాలు దన్నుగా నిలుస్తున్నాయి. సీఐఐ తమ మాజీ అధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ అధ్యక్షతన ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. వరద బాధితుల సహాయార్థం తీసుకున్న చర్యలపై అటు ప్రభుత్వం, ఇటు జిల్లాల అధికార యంత్రాంగం మధ్య సమన్వయకర్తగా వ్యవహరించనున్నది. టీవీఎస్ మోటార్ కంపెనీ రూ. కోటి విరాళాన్ని కేరళ సీఎండీఆర్‌ఎఫ్‌కు ఇచ్చింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తమ ఉద్యోగులను స్వచ్చంధంగా విరాళాలను ప్రకటించాలని కోరింది. సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది. 

కార్ల తయారీ సంస్థలు ఇలా ఉచిత సేవలు


కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఇండియా తమ నిస్సాన్, డట్సన్ కస్టమర్ల కోసం ఉచిత సేవలను అందుబాటులోకి తెచ్చింది. బీమా వసతి త్వరగా అందేలా చర్యలు చేపట్టింది. టాటా మోటార్స్, ఫోక్స్‌వాగన్, మెర్సిడెస్ బెంజ్ సైతం ఇప్పటికే ఇదే తరహా సాయంతో ముందుకొచ్చాయి. ఇక టెలికం కంపెనీలు కేరళ వినియోగదారుల కోసం ప్రత్యేక డేటా ప్యాకేజీలను అందజేస్తున్నాయి. టాక్ టైమ్ క్రెడిట్, బిల్లు చెల్లింపులకు గల గడువు పొడిగిస్తున్నాయి. జియో ఏడు రోజుల వాయిస్, డేటా ప్యాక్‌ను ప్రోత్సాహకంగా అందిస్తున్నది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా కూడా ఆఫర్లు అందజేస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios