అతి తక్కువ ధరకు మద్యం ఏ రాష్ట్రంలో లభిస్తుందో తెలుసుకోండి..?
మన దేశంలో అతి తక్కువ ధరకే మద్యం లభించే రాష్ట్రం ఎక్కడుందో తెలుసా అయితే వెంటనే తెలుసుకోండి.. ఈ రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల వారికి పర్యాటకుల సంఖ్య కూడా భారీగా పెరిగింది.
గోవా పర్యాటకులకు స్వర్గధామం. ఇక్కడి అందమైన వాతావరణం , బీచ్‌లు ఎల్లప్పుడూ పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఒక్కసారి గోవా వెళితే మళ్లీ మళ్లీ అక్కడికే వెళ్లాలనిపిస్తుంది. గోవా రాష్ట్రంలో కేవలం నైట్ పార్టీలే కాదు, ఇక్కడ మద్యం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. గోవాలో మీకు కొన్ని మెడికల్ షాపులు, కిరాణా దుకాణాల తరహాలో ఎక్కడ పడితే అక్కడ మద్యం దుకాణాలు కనిపిస్తాయి. ఇక్కడ మద్యం దుకాణాల్లో మద్యం తక్కువ ధరకే లభిస్తుంది. దీంతో ఇతర రాష్ట్రాల వారు తమ రాష్ట్రానికి గోవా మద్యం తీసుకొని వెళ్లాలని ఆశిస్తారు. కానీ పరిమితికి మించి తీసుకొని వెళ్లలేరు. అంతకు మించి కొనుగోలు చేసి మరొక రాష్ట్రానికి రవాణా చేయలేరు. ఇందుకోసం ఆయా రాష్ట్రాలు కఠిన చట్టాలను రూపొందించాయి.
మద్యం ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. దేశంలోనే అతి తక్కువ ధరకు మద్యం లభించే రాష్ట్రం గోవా. గోవాలో పన్ను రేట్లు దేశంలోనే అత్యల్పంగా ఉన్నాయి. ఉాదాహరణకు ఏపీ, తెలంగాణో మద్యంపై పన్ను రేటు చాలా ఎక్కువ. ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన విశ్లేషణ ప్రకారం, గోవాలో విస్కీ, రమ్, వోడ్కా , జిన్ చౌకగా లభిస్తాయి. గోవాలో రూ.100 ఉన్న బాటిల్ తెలంగాణలో రూ.500 ఉండే వీలుంది.
గోవాలో మద్యం ధరలు తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి:
తక్కువ ఎక్సైజ్ డ్యూటీ : ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ప్రభుత్వాలకు అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరులలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ఎక్సైజ్ అనేది ప్రభుత్వ ఖజానాను నింపే శాఖ. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వాలు కూడా వదలడం లేదు. గోవాలో మద్యంపై ఎక్సైజ్ సుంకం ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. ఉదాహరణకు, గోవాలో 750ml విస్కీ బాటిల్ ధర రూ.1,500. తెలంగాణలో అదే బాటిల్‌కు 3,000 పలుకుతుంది.
పర్యాటకం: గోవా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు గోవాను సందర్శిస్తారు. దీనికి గోవాలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి , దీంతో ఇక్కడ తక్కువ ధరకే హాయిగా మద్యం తాగవచ్చు కాబట్టి దేశం నలుమూలల నుండి , విదేశాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడకు వస్తారు. పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది.
ఆర్థిక స్థితి: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గోవా ఆర్థికంగా వెనుకబడి ఉంది. గోవా ఇతర రాష్ట్రాల కంటే తక్కువ అభివృద్ధి చెందింది. తక్కువ ఆదాయం ఉన్నవారికి తక్కువ ధరకే మద్యం అందించడం మరో కారణం.
గోవాలో మద్యం ధర ఎంతో తెలుసా ?: 750ఎంఎల్ విస్కీ బాటిల్ రూ.1,500కు విక్రయిస్తున్నారు. అదే 750 ఎంఎల్ వైన్ బాటిల్ ధర రూ.1,000. 750 ml బీర్ బాటిల్ 150 రూపాయలకు మీకు లభిస్తుంది.
ఈ రాష్ట్రంలో తక్కువ ధరలకు మద్యం కూడా దొరుకుతుంది: గోవా తర్వాత పాండిచ్చేరిలో చౌకైన మద్యం అందుబాటులో ఉంది. ఈ జాబితాలో డామన్ , డయ్యూ, పంజాబ్, హర్యానా, ఢిల్లీ ఉన్నాయి.