Asianet News TeluguAsianet News Telugu

ఫోర్బ్స్‌ శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ కి చోటు.. వరుసగా రెండోసారి కూడా..

ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా, హెచ్‌సిఎల్ ఎంటర్‌ప్రైజ్ సీఈఓ రోష్ని నాదర్ మల్హోత్రాతో పాటు వరుసగా 10వ సంవత్సరం కూడా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్  అగ్రస్థానంలో నిలిచారు.
 

Finance Minister Nirmala Sitharaman at 41 on Forbes 2020 list of most powerful 100 women
Author
Hyderabad, First Published Dec 9, 2020, 5:05 PM IST

ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా రెండో సంవత్సరం కూడా చోటు దక్కించుకున్నారు.

ఈ జాబితాలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన కమలా హారిస్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా, హెచ్‌సిఎల్ ఎంటర్‌ప్రైజ్ సీఈఓ రోష్ని నాదర్ మల్హోత్రాతో పాటు వరుసగా 10వ సంవత్సరం కూడా జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్  అగ్రస్థానంలో నిలిచారు.

ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా సీతారామన్ 41వ స్థానంలో ఉండగా, గత ఏడాది 2019లో ఆమె 34వ స్థానంలో నిలిచింది. వ వార్షిక ఫోర్బ్స్ పవర్ లిస్ట్‌లోని మహిళలు 30 దేశాలకు చెందినవారి నాలుగు తరాలలో జన్మించారు.

వారిలో 10 మండి దేశాధినేతలు, 38 మంది సిఇఓలు, 5 ఎంటర్టైనర్లు ఉన్నారు. కాని వారు వయస్సు, జాతీయత, ఉద్యోగాల్లో విభిన్నంగా ఉన్న వారు 2020లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్న మార్గాల్లో ఐక్యంగా ఉన్నారు" అని ఫోర్బ్స్ తెలిపింది.

also read ఇండియాలో మరొక బ్యాంక్ మూసివేత.. వినియోగదారుల డిపాజిట్లపై ఆర్‌బి‌ఐ క్లారిటి.. ...

నాదర్ మల్హోత్రా 55వ స్థానంలో, కిరణ్ మజుందార్-షా 68వ స్థానంలో, ల్యాండ్మార్క్ గ్రూప్ చైర్‌మెన్ రేణుకా జగ్టియాని 98వ స్థానంలో ఉన్నారు. ఏంజెలా మెర్కెల్ వరుసగా 10 సంవత్సరం కూడా నంబర్ 1 స్థానంలో ఉంది. ఏంజెలా మెర్కెల్ ప్రస్తుతం ఐరోపా ఫాక్టో లీడర్ గా కొనసాగుతున్నారు.

అమెరికా వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మొదటి మహిళ, బ్లాక్ అమెరికన్, ఆసియా అమెరికన్ అయిన కమలా హారిస్ ను మొదటిసారి ప్రపంచంలోని 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 3 స్థానంలో చేర్చింది.

యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండవ సంవత్సరంలో కూడా రెండవ స్థానంలో ఉన్నారు. కోవిడ్-19పై సమర్థవంతమైన పోరాటంలో ఈ సంవత్సరం శక్తివంతమైన మహిళల్లో చాలామంది ప్రపంచ ప్రశంసలు అందుకున్నారు.

 న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ ( 32), తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్-వెన్ ( 37), సివిఎస్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కరెన్ లించ్ (38), అమెరికన్ మల్టీ నేషన్ సంస్థ యునైటెడ్ పార్సెల్ సర్వీస్ కరోల్ టోమే (11), కాలిఫోర్నియాకు చెందిన క్లోరోక్స్ లిండా రెండల్ (87).

ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో  కొత్తగా చేరిన 17 మంది వీరే.

ఈ జాబితాలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్ మెలిండా గేట్స్ ( 5), యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి (7), ఫేస్‌బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ శాండ్‌బర్గ్ (22), బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా (39), యు.కె క్వీన్ ఎలిజబెత్ II (46), ప్రముఖ కళాకారులు రిహానా (69), బెయోన్స్ (72). 

Follow Us:
Download App:
  • android
  • ios