మహారాష్ట్రకు చెందిన ది కరాడ్ జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) రద్దు చేసింది. బ్యాంకుకు తగినంత ఫైనాన్స్ లేదని పేర్కొంటూ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించకుండ నిరోధించింది.

ఇకపై  బ్యాంకుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు చేయలేరు. మహారాష్ట్రలోని సహకార సంఘాల సహకార రిజిస్ట్రార్ కమిషనర్‌ను బ్యాంకును మూసివేసేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని, దాని కోసం లిక్విడేటర్‌ను నియమించాలని సెంట్రల్ బ్యాంక్ అభ్యర్థించింది.

అయితే బ్యాంకు డిపాజిటర్లకు వారి డబ్బు చెల్లించే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆర్‌బిఐ తెలిపింది. ప్రతి డిపాజిటర్ సాధారణ నిబంధనలు, షరతుల ప్రకారం డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ నుండి 5 లక్షల వరకు అందుకుంటారు. బ్యాంక్ డిపాజిటర్లలో 99% కంటే ఎక్కువ మంది డిపాజిట్ల ఫుల్ పేమెంట్ డిఐసిజిసి నుండి పొందుతారు.

also read పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో వినియోగదారులకు ఇబ్బందులు.. ప్రభుత్వం ఎంత పన్ను విధిస్తుందో తెలుసా .. ...

ఆర్‌బిఐ మంగళవారం జారీ చేసిన నోటీసులో బ్యాంకుకు తగినంత మూలధనం, ఆదాయాలు లేవని పేర్కొంది. అందువల్ల ప్రస్తుతం డిపాజిటర్లకు డిపాజిట్ ను పూర్తిగా చెల్లించలేకపోతుంది. బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించడానికి బ్యాంకును అనుమతిస్తే ప్రజా ప్రయోజనాలకు  ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. గత మూడు సంవత్సరాలుగా బ్యాంక్ ఆల్ ఇన్క్లూజివ్ డైరెక్షన్స్ కింద ఉంది.

డిఐసిజిసి నిబంధనల ప్రకారం, ఒక బ్యాంకు మునిగిపోతే లేదా మూసివేయబడితే ఆ బ్యాంకులో రూ.5 లక్షల వరకు వినియోగదారుల డిపాజిట్లు భద్రంగా ఉంటాయి. లైసెన్స్ రద్దు, లిక్విడేషన్ చర్యలను ప్రారంభించడంతో ది కరాడ్ జనతా కోఆపరేటివ్ బ్యాంక్ డిపాజిటర్లకు చెల్లింపు ప్రక్రియ ప్రారంభించబడుతుంది.

బ్యాంకు పై ఎందుకు చర్యలు తీసుకున్నారు:  తగినంత మూలధనం, సంపాదించే సామర్థ్యం లేకపోవడం కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఈ చర్య తీసుకుంది. మహారాష్ట్రలో కొంతకాలం పాటు అనేక సహకార బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ చర్యలు తీసుకుంటుంది.

ఈ ఏడాది మేలో ముంబైకి చెందిన సికెపి కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ కూడా  రద్దు చేసింది. ఇటీవల మహారాష్ట్రలోని జల్నా జిల్లా మంతా అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పై ఆరు నెలల నిషేధాన్ని విధించింది.