5 రోజుల్లోనే 10 కోట్ల యూజర్స్: రికార్డ్ సాధించిన ఆ యాప్ ఏంటో మీకు తెలుసా?
ఏ సోషల్ మీడియా యాప్ కైనా అత్యధిక యూజర్స్ ను సాధించడమే లక్ష్యం. యూజర్స్ ను ఆకర్షించడం కోసం యాప్ నిర్వాహకులు కొత్త రకాల కంటెంట్లను పరిచయం చేస్తుంటారు. ఎంత ఎక్కువ మంది యూజర్స్ వస్తే ఆ యాప్ అంత సక్సెస్ అయ్యిందని అర్థమవుతుంది. ఒక యాప్ స్టార్ట్ చేశాక ఏ రోజుకైనా 100 మిలియన్(10 కోట్లు) యూజర్స్ సాధించడం లక్ష్యంగా ఉంటుంది. అలాంటిది 10 కోట్ల మంది యూజర్స్ ను కేవలం 5 రోజుల్లో సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఆ యాప్ గురించి, దాంతో పాటు 10 కోట్ల యూజర్స్ మైలు రాయిని తక్కువ కాలంలో రీచ్ అయిన మరికొన్ని యాప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మెటా యాజమాన్యంలోని అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్ బుక్. ఇది 2004లో ప్రారంభమైంది. ఇది వినియోగదారుల ఫొటోలు, వీడియోలను షేర్ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. ఇతర వినియోగదారులతోనూ మ్యూచువల్ కాంటాక్ట్ లో ఎప్పుడూ ఉండొచ్చు. ఈ ఫేస్‌బుక్ 4.5 సంవత్సరాలలో 100 మిలియన్ యూజర్లను చేరుకుంది.
You Tube
యూట్యూబ్ ఆవిర్భావం ఒక గొప్ప మార్పుకు నిదర్శనం అని చెప్పొచ్చు. అసలు ఈ యూట్యూబ్ సంగీతం, వీడియో కంటెంట్ల కోసం తయారు చేశారు. ఇది గూగుల్ కంపెనీ ప్రోడక్ట్. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ యాప్ 2005లో ప్రారంభమైంది. యూట్యూబ్ 4 సంవత్సరాల 1 నెల తర్వాత 100 మిలియన్ యూజర్స్ ను రీచ్ అయ్యింది.
Snap chat
స్నాప్ చాట్ అనేది మల్టీ మీడియా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్. ఇది పిక్చర్స్, మెసేజస్ పంపుకోవడానికి ఉపయోగిస్తూ చాలా ఫేమస్ అయ్యింది. ఈ స్నాప్ చాట్ లో అన్నీ ఫ్లాష్ మెసేజస్ ఉంటాయి. మనం చిత్రాలు, సందేశాలు చూసిన తర్వాత ఆటోమెటిక్ గా మాయమైపోతాయి. ఈ యాప్ ను 2011లో స్నాప్ ఇంటర్నేషనల్ కంపెనీ ప్రారంభించింది. స్నాప్ చాట్ 3 సంవత్సరాల 8 నెలలకు 100 మిలియన్ యూజర్స్ ను సాధించింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన యాప్ వాట్సాప్. ఇది ఇన్ స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ లలో చాలా ఫేమస్ అయిన యాప్ ఇది. 2009 లో ఇది ప్రారంభమైంది. ఈ యాప్ ఉపయోగించి వినియోగదారులు వాయిస్, వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అవ్వొచ్చు. వాట్సాప్ 3 సంవత్సరాల, 6 నెలలకు 100 మిలియన్ యూజర్స్ ను సాధించింది.
Myspace
మైస్పేస్ అనేది ఒక సోషల్ నెట్ వర్కింగ్ యాప్. ఇది ప్రపంచ వ్యాప్తంగా జనాన్ని పాప్ సంగీతంతో అలరించడానికి 2003లో ప్రారంభించారు. ఇది టెక్నాలజీ రంగంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. మైస్పేస్ యాప్ 3 సంవత్సరాలకు 100 మిలియన్ యూజర్స్ ను సాధించింది.
ఇన్‌స్టాగ్రామ్ 2 సంవత్సరాల 6 నెలలకు 100 మిలియన్ యూజర్లను చేరుకుంది. ఈ సోషల్ మీడియా యాప్ ద్వారా ఫోటో, వీడియో షేరింగ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇతరులతో మ్యూచువల్ కాంటాక్ట్ లో ఉండొచ్చు. ఈ యాప్ 2010లో స్టార్ట్ చేశారు. ఇన్ స్టాగ్రామ్ యాప్ యూత్ లో చాలా క్రేజ్ ఉన్నయాప్.
వుయ్ చాట్ అనేది ఒక చైనీస్ ఇన్ స్టంట్ మెసేజింగ్, సోషల్ మీడియా ప్లాట్ ఫాం. ఇది 2011లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఒక బిలియన్ కంటే ఎక్కువ యూజర్స్ ఉన్న క్రేజీ యాప్. వుయ్ చాట్ కేవలం 1 సంవత్సరం 2 నెలలకు 100 మిలియన్ యూజర్లను ఆకర్షించింది.
Tik Tok
టిక్‌టాక్ 9 నెలల్లోనే 100 మిలియన్ యూజర్ల మైలురాయిని దాటింది. ఈ యాప్ ద్వారా చిన్న వీడియోలు సృష్టించడం, షేర్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యాప్ ను 2017 లో ప్రారంభించారు. మ్యూజిక్, డాన్స్, కామెడీ, ఇలా రకరకాల వీడియోలు రూపొందించి షేర్ చేసుకోవడం ఈ యాప్ లో చాలా సులభంగా జరిగేది. అయితే ఇది ఇండియాలో 2020లో బ్యాన్ అయ్యింది.
Chat GPT
చాట్ జీపీటీ కేవలం 2 నెలల్లో 100 మిలియన్ యూజర్లను చేరుకుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా రూపొందిన చాట్‌బాట్. ఇది 2022లో ప్రారంభమైంది. ఓపెన్ ఏఐ సంస్థ దీన్ని రూపొందించింది. చాట్ జీపీటీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఉపయోగించుకొని పనిచేస్తుంది. ఇది అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసింది. ముఖ్యంగా విద్యార్థులు తమ సందేహాలు తీర్చకోవడానికి చాట్ జీపీటీ బాగా ఉపయోగపడుతోంది.
Threads
మెటా సంస్థ విడుదల చేసిన థ్రెడ్స్ యాప్ కేవలం 5 రోజుల్లో 100 మిలియన్ యూజర్లను చేరుకుంది. ఈ యాప్ 2023 జూలై 5న ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా వినియోగదారులు టెక్స్ట్, చిత్రాలు, వీడియోలను పోస్ట్ చేయవచ్చు. అలాగే రిప్లై, రీపోస్ట్‌లు కూడా చేయవచ్చు. దీని ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ 100 మిలియన్ మార్క్ గురించి చెప్పి సంతోషం వ్యక్తం చేశారు.