నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) నేషనల్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ఎన్‌ఇటిసి) కార్యక్రమం కింద జూలైలో ఫాస్ట్‌టాగ్ లావాదేవీలు 8.6 కోట్లు దాటిందని తెలిపింది. గత రెండు నెలలతో పోల్చితే ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీల సంఖ్య 54 శాతం పెరిగిందని వెల్లడించింది.

2020 జూలైలో 8.62 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీల ఫలితంగా 1623.30 కోట్ల లావాదేవీలు జరిగాయని ఎన్‌పిసిఐ తెలిపింది. కాగా, 2020 జూన్‌లో 8.19 కోట్ల లావాదేవీలు జరిగాయి. ప్రత్యేక విషయం ఏమిటంటే, కరోనా కాలంలో ప్రతిచోటా క్షీణతను చూస్తుండగా, ఫాస్ట్ ట్యాగ్ లావాదేవీలు మాత్రం బాగా పెరిగాయి.

 కోవిడ్ -19 కారణంగా ప్రజలు క్యాష్ లెస్ లావాదేవీలను ఇష్టపడుతున్నారని  నిపుణులు భావిస్తున్నారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి, వాహనదారుల సమయాన్ని వృదా కాకుండా ఫాస్ట్‌టాగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. వాస్తవానికి టోల్ లైన్లు టోల్ టాక్స్ కోసం టోల్ ప్లాజాలు ఉండేవి.

ఈ కారణంగా ప్రజలు చాలాసేపు  వేచి ఉండాల్సి వచ్చేది. అది కాకుండా ఈ సమయంలో ఇంధనం కూడా వృదా అవుతుంది. ఈ కారణంగా, ప్రభుత్వం ఫాస్ట్‌టాగ్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది, ఇది టోల్ ప్లాజా వద్ద క్యూలను భారీగా తగ్గించటానికి ప్రస్తుతం, ఈ సర్వీస్ దేశంలోని 695 టోల్ ప్లాజాల  వద్ద  అందుబాటులో ఉందని వివరించింది.

also read రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్ : ఈ-పాస్ ప్రారంభించిన రైల్వే బోర్డు ఛైర్మన్.. ...

నేషనల్ ఎలక్ట్రానిక్స్ టోల్ కలెక్షన్ ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా  ఉంది, ఇక్కడ ఫాస్ట్‌టాగ్ సేవలకు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఈ సేవను దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో అమలు చేస్తున్నారు. 

నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఢీల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో మాల్స్, విమానాశ్రయాలు, ప్రైవేట్ పార్కింగులో ఫాస్ట్‌టాగ్ సేవలను ప్రారంభించబోతోంది. ఇది కాంటాక్ట్‌లెస్ పార్కింగ్‌ను సాధ్యం చేస్తుంది. 


ఫాస్ట్‌టాగ్ అంటే ఏమిటి? 

ఫాస్ట్‌టాగ్ అనేది వాహనం  విండ్‌షీల్డ్‌ పై అమర్చిన ఎలక్ట్రానిక్ టోల్ కనెక్షన్ డివైజ్, దీని ద్వారా డ్రైవర్ తన కారును టోల్ ప్లాజా వద్ద ఆపాల్సిన అవసరం లేదు. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ (RFID) తో కూడిన ఈ డివైజ్ ప్రీపెయిడ్ వాలెట్ లేదా లింక్డ్ బ్యాంక్ ఖాతా నుండి నేరుగా టోల్ ఛార్జీలను వసూలు చేయడానికి ఉపయోగించబడుతుంది.