కోవిడ్-19 చికిత్సలో ఉపయోగించే టీకాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతులపైనా, దేశీయంగా సరఫరాపైనా వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మినహాయింపునిస్తే అవి మరింత ఖరీదుగా మారతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
కోవిడ్ వ్యాక్సిన్, మందులు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల దిగుమతులపై వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి )ను తొలగించడం వల్ల ప్రాణాలను రక్షించే మందులు, వస్తువులు కొనుగోలుదారులకు ఖరీదైనవి అవుతాయని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు.
దీనికి కారణాన్ని వివరిస్తూ జిఎస్‌టిని తొలగించిన తరువాత ముడి / ఇంటర్మీడియట్ వస్తువులు, ఉత్పత్తిలో ఉపయోగించే పదార్థాలపై చెల్లించే పన్నుకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనం తయారీదారులకు లభించదని ఆమె అన్నారు. ప్రస్తుతం జిఎస్‌టి దేశీయ సప్లయి, వ్యాక్సిన్ల వాణిజ్య దిగుమతిపై 5 శాతం, కోవిడ్-19 మందులు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లపై 12% వద్ద జిఎస్టి వర్తిస్తుంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కూడా డిమాండ్
ఈ వస్తువులపై జిఎస్‌టి మినహాయింపులు ఇవ్వాలన్న మమతా బెనర్జీ డిమాండ్‌పై స్పందించిన నిర్మలా సీతారామన్ కోవిడ్ టీకాపై పూర్తిస్థాయిలో జీఎస్‌టీ మినహాయింపునిస్తే ముడి పదార్థంపై వ్యాక్సిన్ తయారీదారులకు చెల్లించే పన్నుకు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ లాభం ఉండదు, వారు మొత్తం ఖర్చును కస్టమర్లు, పౌరుల నుండి తిరిగి పొందుతారు. ఐదు శాతం చొప్పున జీఎస్టీని విధించడం ద్వారా తయారీదారులు ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి) ప్రయోజనాన్ని పొందుతారు, ఐటిసి ఎక్కువగా ఉంటే తిరిగి పొందవచ్చు. అందువల్ల టీకా తయారీదారుల నుండి జీఎస్టీకి మినహాయింపు ఇవ్వడం వినియోగదారులకు నష్టం కలిగిస్తుంది.
ఇంటిగ్రేటెడ్ జిఎస్‌టి (ఐజిఎసిటి) రూపంలో కొన్ని వస్తువులపై రూ.100 రశీదు ఉంటే, ఈ మొత్తంలో సగం కేంద్ర జిఎస్‌టి, రాష్ట్ర జిఎస్‌టి రెండింటికి, కేంద్రంతో పాటు కేంద్ర జిఎస్‌టిగా పరిగణించబడుతుందని సీతారామన్ చెప్పారు. అందుకున్న మొత్తంలో శాతం కూడా ఇవ్వబడుతుంది. ఈ విధంగా ప్రతి రూ.100లో రూ.70.50 మొత్తం రాష్ట్రాల వాటా.
కోవిడ్ రిలీఫ్ మెటీరియల్స్ పై జిఎస్‌టి, కస్టమ్స్ వంటి ఇతర పన్నులను తొలగించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిఎంకు రాసిన లేఖపై ఆర్థిక మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి రాసిన లేఖపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మే 3న జారీ చేసిన ఉత్తర్వులో కోవిడ్ -19 సహాయక సామగ్రి జాబితాను కస్టమ్స్ సుంకం నుంచి విముక్తి చేసినట్లు తెలిపారు. మీ చేసిన జాబితాలో ఉన్న వస్తువులను ఇప్పటికే అందులో చేర్చినట్లు సీతారామన్ అన్నారు.
ప్రధానిని కోరిన మమతా బెనర్జీ
కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడానికి ఉపయోగించే పరికరాలు, మందులపై పన్నులు, కస్టమ్స్ సుంకాలను మినహాయించాలని కోరుతూ మమతా బెనర్జీ ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 'సిలిండర్లు, కంటైనర్లు, కోవిడ్ సంబంధిత మందులను డొనేట్ చేయడానికి పెద్ద సంఖ్యలో సంస్థలు, ప్రజలు, దాతృత్వ సంస్థలు ముందుకు వచ్చాయని లేఖలో పేర్కొన్నారు. కస్టమ్స్, ఎస్‌జిఎస్‌టి, సిజిఎస్‌టి, ఐజిఎస్‌టి నుంచి మినహాయింపు ఇవ్వాలని చాలా మంది దాతలు రాష్ట్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపారు అని తెలిపారు.
