న్యూ ఢీల్లీ: ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 80లక్షల మంది చందాదారులు ఏప్రిల్ నుంచి నాలుగు నెలల్లోపు రూ .30,000 కోట్లు ఉపసంహరించుకున్నారు. సంస్థ రూ.10 ల‌క్షల కోట్ల నిధిని నిర్వహిస్తోంది.

ఈపీఎఫ్‌ఓ పరిధిలో మొత్తం 6కోట్ల మంది చందాదారులు ఉన్నారు. ఏప్రిల్ నుండి జూలై మూడవ వారం మధ్య ఉపసంహరించబడినచిన మొత్తం సాధారణ సమయాల్లో కంటే చాలా ఎక్కువ అని ఈ‌పి‌ఎఫ్‌ఓ అధికారులు చెప్పారు.

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఉద్యోగ నష్టాలు, జీతంలో కోతలు, వైద్య ఖర్చులు తదితర అంశాలు నగదు ఉపసంహరణకు దారితీసినట్లు  ఈపీఎఫ్‌ఓ అధికారులు తెలిపారు.

"మొత్తం ఉపసంహరణలలో, దాదాపు 3 మిలియన్ల మంది లబ్ధిదారులు కోవిడ్-19 కింద 8వేల కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు, మిగిలిన రూ .22,000 కోట్లు 5 మిలియన్ల ఇపిఎఫ్ఓ చందాదారులు సాధారణ ఉపసంహరణ చేసుకున్నారు" అని ఇపిఎఫ్ఓ అధికారి ఒకరు తెలిపారు.  

also read టెక్‌ మహీంద్రా ఫలితాలు జోరు.. అంచనాలకు మించి 972 కోట్లు లాభం.. ...

ప్రస్తు‍త ట్రెండ్‌ ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో ఈపీఎఫ్‌ నుంచి విత్‌డ్రా చేసుకోనే వారు సంఖ్య కోటికి చేరుకోవచ్చని అధికారు అంచనా వేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు ఉపసంహరణతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫండ్‌ ఆదాయాలపై భారీ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడానికి మార్చి చివరిలో  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన వెంటనే ఉపసంహరణ కోసం ప్రత్యేక కోవిడ్ విండోను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

పదవీ విరమణ ఫండ్ బాడీ  ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (ఎఫ్‌ఐఐసి) గత వారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఉపసంహరణపై సభ్యులను అప్‌డేట్ చేసింది. "కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున, ఉపసంహరణల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది" అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.