అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు ఈపీఎఫ్ అక్కౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఉమంగ్ యాప్ ద్వారా మీరు ఇంట్లో కూర్చొని మీ EPF ఖాతా నుండి డబ్బును సులభంగా విత్‌డ్రా చేసుకోవచ్చు.  

ఉద్యోగులందరి ప్రతినెల జీతంలో కొంత మొత్తాన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)లో జమ చేస్తారు. EPF ఖాతాదారులు పదవీ విరమణ తర్వాత EPFOలో ఉన్న మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, ఈపీఎఫ్ ఖాతాదారులు అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ అక్కౌంట్ నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు మీరు EPFO ​​వెబ్‌సైట్‌కి వెళ్లి EPF నుండి డబ్బు పొందవచ్చు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ఉమంగ్ అప్లికేషన్ ద్వారా కూడా ఈపీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని ఈ యాప్ ద్వారా మీరు మీ పీఎఫ్ ఖాతా నుంచి సులభంగా డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. సాధారణంగా ప్రజలు ఇంటి మరమ్మతులు, పెళ్లి ఖర్చులు, కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం పీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకుంటుంటారు. ఇంతకుముందు పీఎఫ్ అక్కౌంట్ నుంచి డబ్బు తీసుకోవాలంటే బ్యాంకు లేదా పీఎఫ్ ఆఫీసుకు చాలాసార్లు తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు మీరు ఉమంగ్ యాప్ ద్వారా సులభంగా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు. 

ఉమంగ్ యాప్ ద్వారా ఎలా ఉంటుంది?
UMANG యాప్ ద్వారా మీ EPFO ​​అక్కౌంట్ నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి, మీరు మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని మీ ఆధార్ నంబర్‌తో లింక్ చేయాలి. కింద ఉన్న స్టెప్స్ అనుసరించడం ద్వారా మీరు మీ EPF అక్కౌంట్ నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.
*మొదట ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోండి.
* యాప్‌లో ఉన్న ఆప్షన్స్ నుండి EPFO ​​ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండీ.
*క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీ UAN నంబర్‌ను ఎంటర్ చేయండి
*EPFOలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేయండి.
*మీ PF అక్కౌంట్ నుండి విత్ డ్రా పద్ధతిని సెలెక్ట్ చేసుకొని, దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.

*అప్లికేషన్ సబ్మిట్ చేయండి ఇంకా విత్ డ్రా అప్లికేషన్ కోసం రిఫరెన్స్ నంబర్‌ను పొందుతారు
*ఈ రిఫరెన్స్ నంబర్ ఉపయోగించి విత్ డ్రా రిక్వెట్ ని ట్రాక్ చేయండి.
*EPFO మూడు లేదా నాలుగు రోజుల్లో మీ అక్కౌంట్ కు డబ్బును ట్రాన్సఫర్ చేస్తుంది.
ఉమంగ్ యాప్ అత్యవసర ఖర్చుల కోసం డబ్బును ఉపసంహరించుకోవడానికి సహాయపడుతుంది. ఈ యాప్ తో మీరు బ్యాంక్ లేదా PF ఆఫీసుని వెళ్లకుండానే డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, మీరు మీ అక్కౌంట్ నుండి డబ్బును విత్‌డ్రా చేయడానికి తగిన కారణాన్ని తెలియజేయాలి. 

ఆన్‌లైన్‌లో ఎలా డ్రా చేయాలి?
*మొదట UAN పోర్టల్ https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/కి లాగిన్ అవ్వండి. 
*మీ UAN అండ్ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ చేయండి. ఆ తర్వాత అతేంటికేషన్ కోసం captcha ఎంటర్ చేయండి.
* ఇప్పుడు 'ఆన్‌లైన్ సర్వీసెస్'పై క్లిక్ చేసి, క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండీ
* ఆ తర్వాత మీ బ్యాంక్ అక్కౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి. ఇప్పుడు 'వెరిఫై'పై క్లిక్ చేయండి.
* తరువాత 'యెస్' ఆప్షన్ పై క్లిక్ చేసి, కొనసాగండి.
*'ప్రొసీడ్ ఫర్ ఆన్‌లైన్ క్లెయిమ్'పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు మీరు క్లెయిమ్ ఫారమ్‌లో 'ఐ వాంట్ టు అప్లయ్ ఫర్' కింద క్లెయిమ్ చేస్తున్న కారణాన్ని సెలెక్ట్ చేసుకోండీ. 
*ఇప్పుడు మీ డబ్బును ఉపసంహరించుకోవడానికి 'PF అడ్వాన్స్ (ఫారం 31)' సెలెక్ట్ చేసుకోండీ. ఆ తర్వాత మీరు డబ్బు ఉపసంహరించుకునే ఉద్దేశ్యం, మీకు ఎంత డబ్బు కావాలి అండ్ మీ అడ్రస్ ఎంటర్ చేయాలి.
*ఇప్పుడు సర్టిఫికేట్‌పై క్లిక్ చేసి, మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి
*అవసరమైతే అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి
యజమాని లేదా మ్యానేజ్మెంట్ విత్ డ్రా అభ్యర్థనను ఆమోదించిన తర్వాత, డబ్బు మీ బ్యాంక్ అక్కౌంట్ లో జమ చేయబడుతుంది.