ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్​) గురించి తెలిసే ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతంలో (బేసిక్స్​ శాలరీ​పై) 12 శాతం ఇందులో జమ అవుతుంది. అంతే మొత్తంలో వారి ఉద్యోగ సంస్థ కూడా అందులో జమ చేస్తుంది. 

ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్​) గురించి తెలిసే ఉంటుంది. ప్రతి నెల ఉద్యోగి జీతంలో (బేసిక్స్‌​ శాలరీపై) 12 శాతం ఇందులో జమ అవుతుంది. అంతే మొత్తంలో వారి ఉద్యోగ సంస్థ కూడా అందులో జమ చేస్తుంది. మరి ఉద్యోగాలు తమ ఖాతాల్లో ఎంత బ్యాలెన్స్ ఎంత ఉందే తెలుసుకోవడం ఎలా? ఇంట్లోనే ఉండి బ్యాలెన్స్ తెలుసుకునే పద్ధతుల గురించి ఇప్పుడు చూద్దాం.

పీఎఫ్ ఖాతాదారులు తమ అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకునేందుకు (How to Know EPFO Balance) 4 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. పెరిగిన సాంకేతికత కారణంగా పీఎఫ్ ఆఫీస్​కు వెళ్లకుండానే బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ టోల్ ఫ్రీ నంబర్ '011-22901406' కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా (EPF missed call service) ఎస్ఎంఎస్ రూపంలో పీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ వివరాలను పొందొచ్చు. అయితే ఈపీఎఫ్ఓ వద్ద రిజిస్ట్రర్ అయిన మొబైల్ నంబర్ నుంచి మాత్రమే ఈ సదుపాయం వినియోగించుకునేందుకు వీలుంది.

EPFOHO UAN అని టైప్​ చేసి 7738299899 నంబర్​కు.. రిజిస్ట్రర్ మొబైల్ నంబర్ నుంచి ఎస్​ఎంఎస్​ పంపడం ద్వారా (EPF SMS service) కూడా.. బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్​లోకి లాగిన్ అవడం ద్వారా. పాస్​బుక్​ను యాక్సెస్ (EPF balance with UMANG app) చేయొచ్చు. ఇందులో ప్రతి నెల ఎంత మొత్తం పీఎఫ్ జమ అవుతుంది. ఉద్యోగి వాటా ఎంత? కంపెనీ వాటా ఎంత? సహా ఇప్పటి వరకు జమ అయిన వడ్డీ వంటి వివరాలను కూడా తెలుకునే అవకాశముంది.

ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ పాస్​బుక్​ను యాక్సెస్ చేయొచ్చు. అయితే ముందుగా ఉమాంగ్​లో రిజిస్ట్రర్ చేసుకోవాల్సి ఉంటుంది.