ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తనదైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న సంగతి  తెలిసిందే. ఈ క్రమంలోనే బ్లూ టిక్ పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందేననే నిబంధన కూడా తీసుకొచ్చారు.

ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ తనదైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్లూ టిక్ పొందాలంటే డబ్బులు చెల్లించాల్సిందేననే నిబంధన కూడా తీసుకొచ్చారు. అయితే ఇటీవల అలా డబ్బులు చెల్లించి సబ్‌స్కైబ్ చేసుకోని వారి ట్విట్టర్ ఖాతాల బ్లూ టిక్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ అనేది ఉంటే.. అఫిషియ‌ల్ అకౌంట్ అన్న ఐడెంటిటీ ఉండేది. ఇలా బ్లూ టిక్ తొలిగించిన జాబితాలో ఎక్కువ మంది సెలబ్రిటీలే ఉండటంతో కొంత గందరగోళం నెలకొంది.

అయితే తాజాగా ఈ విషయంలో ఎలన్ మస్క్ యూటర్న్ తీసుకున్నారు. డబ్బులు చెల్లించకపోయినప్పటికీ.. సెలబ్రిటీలకు విలువైన బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్దరించారు. ఇదే విషయాన్ని చాలా మంది ప్రముఖులు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తాము డబ్బులు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోకపోయినప్పటికీ.. బ్లూ టిక్ పునరుద్దరించబడిందని వెల్లడిస్తున్నారు. ఇక, మరణించిన ప్రముఖుల నిష్క్రియ ఖాతాలకు కూడా ట్విట్టర్ బ్లూ టిక్ చూపుతుంది. అయితే సెలబ్రిటీల ఖాతాలకు బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్దరించాలనే ఎలన్ మస్క్ నిర్ణయం వెనక మతలబు ఏమిటన్నది మాత్రం అర్థం కావడం లేదు. గతంలో మాదిరిగా సెలబ్రిటీలకు ఉచితంగానే బ్లూ టిక్ సర్వీసును కొనసాగిస్తారా? లేదా? అనేది కూడ వేచి చూడాల్సి ఉంది. 

అయితే ట్విట్టర్ అకౌంట్స్ బ్లూ టిక్‌ కోసం డబ్బులు చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చినప్పటికీ చాలా మంది యూజర్లు దానికి నిరాకరిస్తున్నారు. కొందరు మాత్రం డబ్బులు చెల్లించి బ్లూ టిక్ మార్క్‌ను సొంతం చేసుకుంటున్నారు. అయితే డబ్బు చెల్లించి సబ్‌స్కైబ్ చేసుకుకోంటే సెలబ్రిటీల ఖాతాల బ్లూ టిక్ మార్కును తొలగించనున్నట్టుగా ట్విట్టర్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని సెలబ్రిటీల ఖాతాల బ్లూ టిక్‌ మార్క్‌ను ట్విట్టర్ తొలగించింది. 

అయితే చాలా మంది సెలబ్రిటీలు డబ్బులు చెల్లించి ట్విట్టర్ ఖాతాకు బ్లూ టిక్ తీసుకొచ్చేందుకు ఆసక్తి కనబరచలేదు. ఈ క్రమంలోనే కొందరు ట్విట్టర్‌ తీరుపై మండిపడ్డారు. అయితే మూడు రోజులు కూడా తిరగకముందే.. సెలబ్రిటీ ట్విట్టర్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్‌ను పునరుద్దరించడం చర్చనీయాంశంగా మారింది.