ట్విట్టర్ టేకోవర్ డీల్‌లో తాజాగా మరో ట్విస్ట్ ఏర్పడింది. మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు తాను కుదుర్చుకున్న డీల్ నుంచి వైదొలగుతానంటూ ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ హెచ్చరించారు. మస్క్ డీల్ గడువు ముగిసిందంటూ గత వారాంతంలో ట్విట్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరోసారి ట్విట్టర్‌కు హెచ్చరిక జారీ చేశాడు. స్పామ్, నకిలీ ఖాతాలపై డేటా అందించకపోతే ట్విట్టర్ కొనుగోలు డీల్‌ను విరమించుకుంటానంటూ తాజాగా హెచ్చరించాడు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా ట్విట్టర్‌కు సోమవారం ఒక లేఖ రాశాడు. విలీన ఒప్పందం ప్రకారం ట్విట్టర్ వివరాలను వెల్లడించడంలో పారదర్శకంగా వ్యవహరించడంలేదని, దీంతో తామడిగిన డేటాను అడ్డుకుంటోందనే అనుమానం మరింత కలుగుతోందని లేఖలో మస్క్ వ్యాఖ్యానించాడు.
ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఎలాన్ మస్క్ తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ ను రూ.3 లక్షల (44 బిలియన్ డాలర్లు) కోట్లకు కొనుగోలుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ట్విట్టర్ ఖాతాల సంఖ్యలో ఎలాన్ మస్క్ సందేహాలకు ట్విట్టర్ యాజమాన్యం నుండి సమాధానం రాలేదు. ట్విట్టర్ లో ఉన్న ఖాతాలన్నీ అసలైనవేనా.. వాటిలో ఫేక్ ఖాతాలు ఎన్ని అనే అంశాలపై సందేహాలను ఎలాన్ వ్యక్తం చేస్తున్నారు. తన సందేహాలకు సమాదానం ఇస్తేనే ఒప్పందం ముందుకు కదులుతుందని ఎలాన్ మస్క్ తేల్చి చెప్పారు.
తాము కోరిన డేటాను నిలిపివేయడం సంస్థ తన సమాచార హక్కులను తీవ్రంగా ప్రతిఘటిస్తోందని, అడ్డుకుంటోందని మస్క్ భావిస్తున్నారని మస్క్ లాయర్లు పేర్కొన్నారు. ఇది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘన అని ఈనేపథ్యంలో డీల్ రద్దు చేయడం సహా అన్ని హక్కులు తమకున్నాయని పేర్కొన్నారు. కాబోయే యజమానిగా కంపెనీ వ్యాపార స్వాధీనం, లావాదేవీ ప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ట్విట్టర్ యాక్టివ్ యూజర్ల బేస్ గురించి పూర్తి, ఖచ్చితమైన అవగాహన ఉండాలని లేఖ స్పష్టం చేసింది. ట్విట్టర్ కొనుగోలు కోసం హెచ్‌ఎస్‌ఆర్ చట్టం కింద నిరీక్షణ వ్యవధి ముగిసిందని ట్విట్టర్ తెలిపిన దాదాపు వారం తర్వాత టెస్లా సీఈవో ఈ లేఖను రాయడం గమనార్హం. మరోవైపు ఈ మస్క్ లేఖపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు.
కాగా ట్విట్టర్‌లో నకిలీ ఖాతాలు మొత్తం యూజర్‌బేస్‌లో 5 శాతం కంటే తక్కువ ఉన్నారో లేదో నిర్ధారించుకునేదాకా 44 బిలియన్ డాలర్ల డీల్‌ను "తాత్కాలికంగా హోల్డ్"లో ఉంచుతున్నట్లు మే 13న ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ యూజర్లలో 5 శాతం వరకు నకిలీ ఖాతాలున్నాయా? లేదా? అనేది ధృవీకరించుకునేందుకు స్వతంత్ర విశ్లేషణను కోరింది. కంపెనీ చట్టాలు, టెస్టింగ్ మెథడాలజీలు సరిపోతాయని నమ్మడం లేదు కాబట్టి తాను తప్పనిసరిగా ఉండాలనేది మస్క్ డిమాండ్.
