భారత్ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతున్న ఎలాన్ మస్క్ కంపెనీ...రిలయన్స్ జియోకు గట్టి పోటీ తప్పదా..?

శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్ సంస్థ అతి త్వరలోనే భారతదేశంలో తన సర్వీస్ లను ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బిలియన్ టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్ స్థాపించిన ఈ స్టార్ లింక్ మనదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు ప్రారంభించింది.

Elon Musk's company, which is preparing to step into India MKA

ప్రపంచంలోని అత్యంత  ధనవంతుడైన ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ త్వరలో భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీస్‌ను ప్రారంభించనుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసిన వార్తల ప్రకారం, కంపెనీ త్వరలో టెలికాం మంత్రిత్వ శాఖ నుండి తన అనుమతిని పొందవచ్చని తెలిపింది. శాటిలైట్ కంపెనీ స్టార్‌లింక్ దాదాపు నెల రోజులుగా భారత్‌లో తన సేవలను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల హోం మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందలేకపోయింది.

శాటిలైట్ ద్వారా గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ (GMPCS) సర్వీస్ లైసెన్స్ కోసం స్టార్‌లింక్ ప్రతిపాదనను మంత్రిత్వ శాఖ పరిశీలించవచ్చని ఒక నివేదిక పేర్కొంది. ఈ లైసెన్స్‌ను కూడా ఆమోదించాలని భావిస్తున్నట్లు వార్తా సంస్థ తెలిపింది. అయితే, కొన్ని అడ్డంకులు కూడా తోసిపుచ్చలేమని పేర్కొంది. 

GMPCS తర్వాత, స్టార్‌లింక్ అనేక ప్రభుత్వ విభాగాలు, భారత అంతరిక్ష మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం పొందవలసి ఉంటుంది. దీని తరువాత, కంపెనీ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను ప్రారంభించవచ్చు.

ప్రస్తుతం, ముఖేష్ అంబానీ ,  జియో ,  సునీల్ మిట్టల్-మద్దతుగల వన్ వెబ్ భారతదేశంలో GMPCS లైసెన్స్‌లను కలిగి ఉన్నాయి. లక్సెంబర్గ్ కంపెనీ SESతో జియో భాగస్వామ్యం ఉంది. జెఫ్ బెజోస్‌కు కూడా 'కైపర్' అనే పేరుతో ఇదే విధమైన ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. కానీ అది ఇంకా భారతదేశంలోకి అడుగుపెట్టలేదు. 

2021లో టెలికాం మంత్రిత్వ శాఖ స్టార్‌లింక్‌ను మందలించింది

లైసెన్స్ లేకుండా భారతదేశంలో తన పరికరాల కోసం ముందస్తు ఆర్డర్‌లు తీసుకోవడం ప్రారంభించిన తర్వాత స్టార్‌లింక్‌ను 2021లో టెలికాం మంత్రిత్వ శాఖ మందలించింది. దాదాపు 5,000 మంది కస్టమర్‌లు తమ ప్రీ-ఆర్డర్‌లను సుమారు 99 డాలర్లకు బుక్ చేసుకున్నారు. భారతీయుల నుంచి రికవరీ చేసిన సొమ్మును తిరిగి ఇవ్వాలని కూడా కంపెనీని కోరింది.

జూన్‌లో కూడా స్టార్‌లింక్ భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది

శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయవద్దని ,  ప్రపంచ ట్రెండ్‌లకు అనుగుణంగా లైసెన్స్‌లను కేటాయించవద్దని స్టార్‌లింక్ భారతదేశం కోసం లాబీయింగ్ చేస్తోందని జూన్‌లో ముందుగా రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.  స్పెక్ట్రమ్ సహజ వనరు అని, దీనిని కంపెనీలు పంచుకోవాలని పేర్కొంది. వేలంలో భౌగోళిక పరిమితులు విధించే అవకాశం ఉందని, దీని వల్ల ఖర్చు పెరుగుతుందని స్టార్ లింక్ వాదిస్తోంది. 

మరోవైపు రిలయన్స్ కేంద్ర ప్రభుత్వానికి బహిరంగంగా వేలం వేయాలని సూచన చేసింది. విదేశీ శాటిలైట్ సర్వీస్ ప్రొవైడర్లు వాయిస్ ,  డేటా సేవలను అందించవచ్చని ,  సాంప్రదాయ టెలికాం కంపెనీలతో పోటీ పడవచ్చని పేర్కొంది. సమానత్వం నిర్వహించడానికి వేలంపాట  సరైన పద్ధతి అని పేర్కొంది

కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో, శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను వేలం వేయాలని రిలయన్స్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉండగా,  మరోవైపు విదేశీ కంపెనీల డిమాండ్‌లను  కేంద్రం అంత తేలికగా అంగీకరించబోదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios