పేరు మార్చుకున్న ఎలాన్ మస్క్, కొత్త పేరు ఇదే...అసలు కారణం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
ట్విట్టర్ అధిపతి మస్క్ తన ట్విట్టర్ యూజర్ నేమ్ మార్చేసుకున్నారు ఆయన వెరైటీగా మిస్టర్ ట్వీట్ పేరిట తన పేజీని నడుపుతున్నట్లు ప్రకటించారు. అయితే ట్విట్టర్ కూడా అధిపతి మస్క్ కు ఒక షాకు ఇచ్చింది అది ఏంటో తెలుసుకుందాం

నిత్యం వివాదాలతో సావాసం చేసే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, తాజాగా మరో సంచలనానికి తరలిపోయాడు. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన ప్రొఫైల్ పేరును నిరంతరం మారుస్తూనే ఉంటారు. అయితే మరోసారి ఆయన తన పేరును మరోసారి మార్చుకున్నాడు. ఈసారి మస్క్ తన పేరును మిస్టర్ ట్వీట్ అని పేరు పెట్టుకున్నాడు.దీంతో నేటిజెన్లు సర్వత్రా దీని గురించే చర్చించుకుంటున్నారు. అయితే ఈసారి ఆయనకు ఈ పేరు బాగా నచ్చిందని తెలుస్తోంది. ట్విట్టర్ చీఫ్ తన పేరును మిస్టర్ ట్వీట్‌గా మార్చుకున్నారు. అయితే ఈ కొత్త పేరు మార్పుతో ట్విట్టర్ లో ఆయన మళ్లీ తన పేరు మార్చుకునే అవకాశం కోల్పోయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన టెక్నికల్ అంశాలను చూపిస్తూ కంపెనీ అనుమతి ఇవ్వడం లేదు.
ఈ విషయాన్ని మస్క్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కొత్త పేరు కూడా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు మళ్లీ పేరు మార్చుకోవడానికి కంపెనీ అనుమతించడం లేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ ద్వారా సమాచారం కూడా పంచుకున్నారు.
మస్క్‌కి తన కొత్త పేరు ఎలా వచ్చింది?
ఎలోన్ మస్క్ స్వయంగా ఈ కొత్త పేరు గురించి ఆలోచించాడు. మస్క్ ఓ కేసుపై చర్చిస్తున్నప్పుడు, లాయర్లు అతన్ని మిస్టర్ ట్వీట్ అనే పేరుతో పిలిచారని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదిక పేర్కొంది. న్యాయవాది అలా పిలవడం మస్క్ కు బాగా నచ్చిందని తెలిపారు.
ఈ మధ్య కాలంలో మస్క్ ట్విట్టర్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. పలు విషయాలపై ఆయన ట్వీట్లు చేస్తున్నారు. ట్విట్టర్‌ని కొన్న తర్వాత మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా అతను చాలా విషయాలపై తన అభిప్రాయాన్ని ఎప్పుడూ చెబుతుండేవాడు. దీంతో ఆయన తన పేరును మిస్టర్ ట్వీట్ గా మార్చుకున్నట్లు తెలుస్తోంది. ట్విటర్‌ని కొనుగోలు చేసిన తర్వాత, మస్క్ దానిలో తరచుగా మార్పులు చేశాడు. ప్రస్తుతం ఇందులో చాలా మార్పులు చేస్తున్నారు. వారు వివిధ ఫీచర్ల గురించి పోల్‌లను ట్వీట్ చేచేస్తున్నారు వాటిఫలితాల ఆధారంగా ఒక ఫీచర్‌ను నిర్ణయిస్తారు.
మస్క్ ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి విప్లవాత్మక మార్పులు జరిగాయి. ట్విట్టర్ సంచలనాలకు మారుపేరుగా మారింది ముఖ్యంగా కంపెనీ పెద్ద ఎత్తున పాత ఉద్యోగులను తొలగించడంతో వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత బ్లూటిక్ విషయంలోనూ వివాదం తల ఎత్తింది. అయితే ఇప్పుడిప్పుడే ట్విట్టర్ గాడిలో పడుతుంది ఆలోచనలను మస్క్ తన కొత్త ఆలోచనలతో ట్విట్టర్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారుస్తున్నారు. గతంలో హేట్ స్పీచ్ పేరిట మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ నేమ్ సస్పెండ్ చేయగా మస్క్ మాత్రం ఆయన అకౌంటును రియాక్టివేట్ చేయడం విశేషం. .