Asianet News TeluguAsianet News Telugu

క్యూలో ఎందుకు దండగ.. ఈ యాప్ ఉండగా.. చిటికలో బుక్ చేసుకోవచ్చు..

తరచుగా రైలు బయలుదేరే సమయానికి స్టేషన్‌కు చేరుకుంటే టిక్కెట్లు దొరక్క  ప్రయాణం కూడా ఆలస్యం అవుతుంది. అయితే మొబైల్ ఫోన్‌తో జనరల్ టిక్కెట్లతో పాటు రిజర్వేషన్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. 

Dont waste time queuing for  tickets; You can book online using this app-sak
Author
First Published Apr 20, 2024, 11:39 AM IST

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, ట్రైన్ టిక్కెట్లు కొనడానికి రైలు ప్రయాణికులు చాలా సేపు క్యూలో నిల్చోవాల్సి వస్తుంది. రద్దీ సమయాల్లో రైల్వే స్టేషన్‌కు త్వరగా చేరుకోకపోతే పనులు ఇంకా ఆలస్యమవుతాయి. తరచుగా రైలు బయలుదేరే సమయానికి స్టేషన్‌కు చేరుకుంటే టిక్కెట్లు దొరక్క  ప్రయాణం కూడా ఆలస్యం అవుతుంది. అయితే మొబైల్ ఫోన్‌తో జనరల్ టిక్కెట్లతో పాటు రిజర్వేషన్ టిక్కెట్లను కూడా బుక్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును.. రైల్వే ప్రయాణికులు UTS మొబైల్ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ అండ్  సీజన్ టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

టిక్కెట్లు బుక్ చేసుకోవడం ఎలా

ముందుగా టిక్కెట్లు కొనడానికి మీరు ప్లే స్టోర్ నుండి UTS యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆపై సైన్ అప్ చేసి, అవసరమైన వివరాలను ఎంటర్  చేయడం ద్వారా యాప్‌లో రిజిస్టర్ చేసుకోండి. UPI, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మీ R-వాలెట్‌ని రీఛార్జ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే UTS యాప్ ప్రయాణికులు  R-వాలెట్ ఛార్జీలపై 3% బోనస్ పొందుతారు.

Dont waste time queuing for  tickets; You can book online using this app-sak

 రైలు టిక్కెట్ బుకింగ్‌ను ప్రారంభించడానికి ముందుగా పేపర్‌లెస్ లేదా పేపర్ టిక్కెట్ అప్షన్స్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి. బయలుదేరే స్టేషన్ ఇంకా  అరైవల్ స్టేషన్ వివరాలను ఎంటర్ చేయండి. R Wallet నుండి లేదా UPI, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వంటి ఇతర పేమెంట్స్  అప్షన్స్ ద్వారా డబ్బు చెల్లించండి

మీరు UTS యాప్‌లో "షో టికెట్" అప్షన్  సెలెక్ట్ చేసుకోవడం  ద్వారా మీ టిక్కెట్‌ను చూడవచ్చు. మీరు పేపర్  టిక్కెట్‌ను సెలెక్ట్ చేసుకుంటే  బుకింగ్ IDని ఉపయోగించి మీరు జనరల్ టికెట్ కౌంటర్ నుండి లేదా రైల్వే స్టేషన్‌లోని టిక్కెట్ వెండింగ్ మెషీన్ నుండి టిక్కెట్‌ను ప్రింటవుట్ తీసుకోవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios