రిలయన్స్ ఇండస్ట్రీస్ చివరి త్రైమాసికంలో అదరగొట్టే లాభాలను పంచింది. దీంతో రిలయన్స్ షేర్లను కొనమని పలు అంతర్జాతీయ స్థాయి బ్రోకరేజ్ సంస్థలు కూడా సిఫార్సు చేస్తున్నాయి. మీరు కూడా రిలయన్స్ షేర్లను కొనాలనుకుంటే ఆయా బ్రోకరేజి సంస్థలు అందించిన టార్గెట్ ధరలను తెలుసుకోండి

ముఖేష్ అంబానీకి నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కి మార్చి క్వార్టర్ రిజల్ట్స్ లో అంచనాలను మించిన పెర్ఫార్మెన్స్ అందించింది. ఆర్థిక సంవత్సరం క్యూ 4 రిజల్ట్స్ RIL రికార్డు స్థాయిలో రూ.19,299 కోట్ల లాభాన్ని ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికతో పోల్చితే 19 శాతం ఎక్కువ నమోదు చేసింది. RIL టెలికాం రిటైల్ విభాగాలలో కూడా వృద్ధి మెరుగ్గా ఉంది. EBITDA 11 శాతంగా ఉంది. ప్రస్తుతం త్రైమాసిక ఫలితాల తర్వాత బ్రోక రేజ్ హౌస్ లోనూ స్టాక్ పై క్రేజ్ నెలకొంది. అదే సమయంలో, అనేక ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు రిలయన్స్ షేర్లు కొనమని పెట్టమని సలహా ఇస్తున్నాయి. 

కంపెనీ ఫలితాలను మరింత విస్తృతంగా చూద్దాం..
2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లాభం 19 శాతం పెరిగి రూ.19,299 కోట్లకు చేరుకుంది. ఇదే అత్యధిక త్రైమాసిక లాభం. చమురు పెట్రోకెమికల్ వ్యాపారం నుండి ఆదాయం పెరగడంతో పాటుగా, రిటైల్ టెలికాం బలమైన వృద్ధి నుండి రికార్డ్ లాభం వచ్చింది. కంపెనీ ఆదాయం 2.8 శాతం పెరిగి రూ.2.39 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం ఆర్థిక సంవత్సరంలో లాభం రూ.66,702 కోట్లుగా ఉంది. ఇది ఇప్పటి వరకు అత్యధిక వార్షిక లాభం. RIL EBITDA వార్షిక ప్రాతిపదికన 22 శాతం పెరిగి రూ.41,389 కోట్లకు చేరుకుంది, ఇది అంచనా కంటే మెరుగైనది. ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్‌ల పన్నుకు ముందు ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.16,293 కోట్లకు చేరుకుంది. రిలయన్స్ జియో లాభం 15.6 శాతం పెరిగి రూ.4984 కోట్లకు చేరుకుంది. కాగా రిటైల్ వ్యాపారంలో లాభం 13 శాతం పెరిగి రూ.2415 కోట్లకు చేరుకుంది. 

బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్
బ్రోకరేజ్ హౌస్ మోతీలాల్ ఓస్వాల్ RIL స్టాక్‌పై పెట్టుబడి పెట్టమని సలహా ఇచ్చారు రూ 2800 టార్గెట్ ఇచ్చారు. 

బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్
బ్రోకరేజ్ హౌస్ జెఫరీస్ కూడా RIL స్టాక్‌పై రూ. 3,125 టార్గెట్ తో 'బయ్' రేటింగ్‌ను ఇచ్చింది. ప్రస్తుతం వాల్యుయేషన్ అనుకూలంగా ఉంది స్టాక్‌లో మరింత బలమైన వృద్ధిని ఆశిస్తున్నామని తెలిపారు. 

బ్రోకరేజ్ హౌస్ JP మోర్గాన్
బ్రోకరేజ్ హౌస్ JP మోర్గాన్ RIL స్టాక్‌పై రూ. 2960 టార్గెట్ తో బయ్ రేటింగ్ ఇచ్చింది. 

బ్రోకరేజ్ హౌస్ CLSA
బ్రోకరేజ్ హౌస్ CLSA RIL స్టాక్‌పై రూ. 2970 అధిక లక్ష్యంతో 'బై' రేటింగ్ ఇచ్చింది. 

(Disclaimer: స్టాక్స్‌లో పెట్టుబడి సలహా బ్రోకరేజ్ హౌస్ ద్వారా అందించబడింది. ఇది ఏషియా నెట్ తెలుగు పోర్టల్ సూచన కాదు. మార్కెట్‌లో పెట్టుబడులు లాభ నష్టాలకు లోబడి ఉంటాయి. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకోండి.)