టెలికాం రంగంలో ప్రధానంగా రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా పోటీపడుతున్నాయి. వీటిలో ఒకరిని మించిన ఒకరు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి.
టెలికాం రంగంలో ప్రధానంగా రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా పోటీపడుతున్నాయి. వీటిలో ఒకరిని మించిన ఒకరు కస్టమర్లను ఆకర్షించేందుకు అనేక సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. గతంలో అన్ లిమిటెడ్ టాక్ టైమ్ ను ఇచ్చిన ఈ మూడు సంస్థలు వాటికి తోడుగా ఇప్పుడు హైస్పీడ్ డేటా, ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ అంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని అగ్రగామిగా నిలిచిన రిలయన్స్ జియో అన్ లిమిటెడ్ టాక్ టైమ్, డేటా, ఓటీటీలను ఫ్రీగా అందజేస్తుంది. దానికి పోటీగా ఇప్పుడు భారతి ఎయిర్ టెల్ సంస్థ ముందుకొచ్చింది.
ఇప్పుడు భారతి ఎయిర్ టెల్ సంస్థ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. అన్ లిమిటెడ్ కాల్స్, హైస్పీడ్ డేటాతో పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను రూ. 2,999 రీఛార్జ్ ప్లాన్ లో కస్టమర్లకు అందజేయనుంది. అయితే ఈ సబ్ స్క్రిప్షన్ ను ఏడాది పాటు ఫ్రీగా అందించనుంది. అందుకు గానూ ఎయిర్ టెల్ కస్టమర్లు రూ.2,999 ప్లాన్ ను యాక్టివేట్ చేయించుకోవాల్సి ఉంది. అయితే ఈ రీఛార్జ్ ప్లాన్ గతంలో రూ. 3,359 ధరకు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ. 2,999 లకు తగ్గింపు చేసినట్లు తెలుస్తోంది.
ఏడాది పాటు ఫ్రీగా..!
ఏడాది పాటు అంటే 356 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ రీఛార్జ్ ప్లాన్ ను రూ. 2999 ధరకే భారతి ఎయిర్ టెల్ టెలికాం సంస్థ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ లో రోజుకు 2 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. వీటితో పాటు రూ. 499 విలువ కలిగిన డిస్నీ + హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. మరోవైపు Wynk మ్యూజిక్, ఉచిత హలో ట్యూన్, టోల్ ప్లాజా కు ఉపయోగించే ఫాస్ట్ ట్యాగ్ పై రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ వంటి ఆఫర్లు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్ లో ఉన్నాయి. షా అకాడమీలో ఉచితంగా ఆన్ లైన్ కోర్సులు పొందవచ్చు. మరోవైపు అమెజాన్ ప్రైమ్ మొబైల్ ఎడిషన్ ను నెల రోజుల పాటు ఫ్రీ ట్రయల్ అందుబాటులో ఉంటుంది. అయితే దీనిపై ఎయిర్ టెల్ సంస్థ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
రీఛార్జ్ ప్లాన్ లో మార్పు..!
356 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్, 2 GB డేటా పొందే సదుపాయం కలిగిన రీఛార్జ్ ప్లాన్ గతంలో రూ. 3,359 ధరకు అందుబాటులో ఉండేది. కానీ, టెలికాం యూజర్లను ఆకర్షించేందుకు ఎయిర్ టెల్ సంస్థ దాన్ని రూ. 2,999 లకు తగ్గింపు చేసింది. అయితే దీనిపై సదరు సంస్థ అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ ప్లాన్ ద్వారా ఏడాది పాటు 730 GB డేటాను కస్టమర్లు పొందనున్నారు.