ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ గా డీబీఎస్ బ్యాంక్

https://static.asianetnews.com/images/authors/d7f5adfb-1610-5d53-be8e-55db5850d97e.jpg
First Published 28, Aug 2018, 12:36 PM IST
DBS named Best Bank in the World
Highlights


ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ గా డీబీఎస్ బ్యాంక్ ఎన్నికయ్యింది. ప్రముఖ మ్యాగజైన్ గ్లోబల్ ఫినాన్స్.. ప్రతి సంవత్సరం..  ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ అవార్డును అందజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అవార్డులను ప్రకటించింది. 

ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ గా డీబీఎస్ బ్యాంక్ ఎన్నికయ్యింది. ప్రముఖ మ్యాగజైన్ గ్లోబల్ ఫినాన్స్.. ప్రతి సంవత్సరం..  ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ అవార్డును అందజేస్తుంది. అలాగే ఈ సంవత్సరం కూడా అవార్డులను ప్రకటించింది. కాగా.. డీబీఎస్ బ్యాంక్ వరల్డ్స్ బెస్ట్ గ్లోబల్ బ్యాంక్ 2018 అవార్డ్ ని దక్కించుకుంది.

అంతర్జాతీయంగా డీబీఎస్ బ్యాంకు సాధించిన గుర్తింపు, సంస్థ పోటీ తత్వం, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ లో లీడర్ షిప్ తదితర కారణాల దృష్ట్యా డీబీఎస్ బ్యాంక్ కి బెస్ట్ బ్యాంక్ అవార్డు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా డిజిటల్ బ్యాంకింగ్ లో ఇతర బ్యాంకులతో పోలిస్తే.. ఇది ముందు వరసలో ఉంది. గడిచిన మూడేళ్లలో డిజిటల్ బ్యాంకింగ్ లో ది బెస్ట్ అవార్డును ఈ బ్యాంక్ రెండు సార్లు అందుకుంది. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఈ అవార్డు అందజేసినట్లు తెలిపారు.

‘‘ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిరంతరాయంగా మారుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకులు క్రమంగా నియంత్రణ, మార్కెట్ పరిస్థితులను వేంగా మార్చుకునేందుకు అనుగుణంగా ఉంటాయి’’ అని గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ పబ్లిషర్, ఎడిటోరియల్ డైరెక్టర్ జోసెఫ్ తెలిపారు. 

‘‘ ప్రపంచంలోని అత్యుత్తమ  బ్యాంక్ గా మారడానికి ప్రస్తుత కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక సేవల పరిశ్రమలో భద్రత, ఆవిష్కరణలు చాలా అవసరం. డీబీఎస్ బ్యాంక్ డిజిటిల్ గా అభివృద్ధి చెందింది. అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించి వినియోగదారులను ఆకట్టుకుంది’’ అని జోసెఫ్ పేర్కొన్నారు.
 
2014లో తొలిసారిగా డీబీఎస్ బ్యాంక్... అత్యంత సమగ్రమైన ట్రాన్స్ ఫర్మేషన్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. అది కూడా డిజిటల్ రూపంలో అవ్వడంతో అది ఎక్కువగా సఫలీకృతం అయ్యింది.

కాగా.. డీబీఎస్ బ్యాంక్ కి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాంక్ అవార్డు రావడం పట్ల బ్యాంక్ సీఈవో పీయూష్ గుప్త హర్షం వ్యక్తం చేశారు.  ఈ విషయాన్ని వారి వాటాదారులకు, ఉద్యోగులకు, కష్టమర్లతో పంచుకోవడానికి చాలా ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. 

loader