Asianet News TeluguAsianet News Telugu

క్షీణించిన కాగ్నిజెంట్ లాభాలు: సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త సి‌ఎఫ్‌ఓ..

గత ఏడాది ఇదే కాలంలో 509 మిలియన్ డాలర్లును ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 3.4 శాతం తక్కువగా 4 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొదటి త్రైమాసికంలో రాన్సమ్‌వేర్‌  దాడి కారణంగా రెండవ త్రైమాసికంలో కరోనా వైరస్ కారణంగా 50-70 మిలియన్ డాలర్ల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని  కంపెనీ తెలిపింది. 

Cognizant Q2 Net profit declines 29% and new CFO appointed
Author
Hyderabad, First Published Jul 30, 2020, 3:03 PM IST

ముంబయి: న్యూజెర్సీ ప్రధాన కార్యాలయం టెక్నాలజీ ప్రొవైడర్ కాగ్నిజెంట్ జూన్ నెలతో ముగిసిన రెండవ త్రైమాసికంలో నికర లాభం 29 శాతం క్షీణించి 361 మిలియన్ డాలర్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో 509 మిలియన్ డాలర్లును ఆర్జించింది.

వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం మాత్రం 3.4 శాతం తక్కువగా 4 బిలియన్‌ డాలర్లకు చేరింది. మొదటి త్రైమాసికంలో రాన్సమ్‌వేర్‌  దాడి కారణంగా రెండవ త్రైమాసికంలో కరోనా వైరస్ కారణంగా 50-70 మిలియన్ డాలర్ల ప్రభావాన్ని ఎదుర్కోవలసి వచ్చిందని  కంపెనీ తెలిపింది.

ఈ త్రైమాసికంలో కాగ్నిజెంట్ సంస్థ ఒక మార్గదర్శకత్వాన్ని అందించింది. 2020 పూర్తి సంవత్సరానికి ఆదాయం 16.4-16.7 బిలియన్ డాలర్ల పరిధిలో ఉంటుందని కాగ్నిజెంట్  ఆశిస్తోంది. ఇది 2-0.5 శాతం క్షీణతకాగా కొన్ని కంటెంట్‌ సంబంధ సర్వీసుల నుంచి వైదొలగడం వల్ల 1.1 శాతంమేర మార్జిన్లపై ప్రతికూల ప్రభావం పడవచ్చని పేర్కొంది.

విదేశీ మారక ప్రభావం సైతం 0.2 శాతంమేర ప్రతిఫలించవచ్చని అభిప్రాయపడింది. నిర్వహణ మార్జిన్లు 15.1 శాతం నుంచి 14.1 శాతానికి నీరసించాయి. కాగ్నిజెంట్ ప్రస్తుత సిఎఫ్‌ఓ కరెన్ మెక్‌లాఫ్లిన్‌ 17 సంవత్సరాల సర్వీస్ తర్వాత కంపెనీ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది.

also read హైదరాబాద్‌, ముంబైలోని జీవీకే స్థావరాలపై ఈడీ సోదాలు.. ...

కరెన్ మెక్‌లాఫ్లిన్‌ స్థానంలో కొత్త  సిఎఫ్‌ఓగా జాన్ సీగ్మండ్ సెప్టెంబర్ 1, 2020 నుండి బాధ్యతలు స్వీకరించనున్నట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌  వెల్లడించింది. జాన్ సిగ్మండ్ ఇటీవల హ్యూమన్ రిసోర్స్ సాఫ్ట్‌వేర్ సర్వీస్ సంస్థ ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్  సిఎఫ్‌ఓగా పనిచేశారు. 

కాగ్నిజెంట్ ఇండియా కంట్రీ ఎండీగా వ్యవహరించిన రామ్‌కుమార్‌ రమణమూర్తి, గ్లోబల్‌ డెలివరీ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రదీప్‌ షిలీజీ ఇటీవల కంపెనీ నుంచి వైదొలగిన విషయం విదితమే.

 క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ సర్వీసెస్, ఐటి టెక్నాలజి, డిజిటల్ ఇంజనీరింగ్ వంటి రంగాల్లో క్లయింట్ డిమాండ్ పెరిగిందని తెలిపింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ మాట్లాడుతూ, "మా పోటీతత్వాన్ని మెరుగుపరుస్తూనే మేము రెండవ త్రైమాసిక పనితీరును అందించాము.

బ్యాంకింగ్, భీమా రెండింటిలో క్షీణత కారణంగా సంస్థ ఆర్థిక సేవల మొత్తం ఆదాయంలో 34.9 శాతం, సంవత్సరానికి 5.2 శాతం తగ్గింది. అయితే హెల్త్ కేర్ ఆదాయం సంవత్సరానికి 2.0 శాతం పెరిగింది.

మొత్తం ఆదాయంలో డిజిటల్‌ విభాగం వాటా పెరుగుతున్నట్లు కాగ్నిజెంట్‌ తెలియజేసింది. క్యూ2లో 14 శాతం వృద్ధి చూపగా మొత్తం ఆదాయంలో 42 శాతం వాటాను ఆక్రమించినట్లు వివరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios