చాట్‌జిపిటి (చాట్ జనరేటివ్ ప్రీ-ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చట్టపరమైన వివాదంలో చిక్కుకుంది. ఈ AI సాధనం ఎంత వేగంగా పాపులర్ అవుతుందో, దాని పేరు అంత వేగంగా వివాదాల్లోకి వస్తోంది. కెనడా ఇప్పటికే సంస్థ ChatGPTకి వ్యతిరేకంగా దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని ఒక ప్రాంతీయ మేయర్ OpenAIపై పరువు నష్టం దావా వేశారు. దీని గురించి తెలుసుకుందాం. 

OpenAI కంపెనీ తయారు చేసిన ప్రముఖ చాట్‌బాట్ మోడల్ ChatGPT వివాదంలో ఇరుక్కుంది.  రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఆస్ట్రేలియాలోని ఒక నగరానికి చెందిన మేయర్ బ్రియాన్ హుడ్, ChatGPT తనపై తప్పుడు క్లెయిమ్‌లుగా పేర్కొందని అందుకే ఓపెన్ ఏఐ కంపెనీ మీద పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించింది. 

ChatGPT ఇచ్చిన తప్పుడు సమాచారం కారణంగా కంపెనీ కోర్టుకు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆస్ట్రేలియా ప్రాంతీయ మేయర్ బ్రియాన్ హుడ్ కంపెనీకి వివరణ కోరుతూ ఇఫ్పటికే 28 రోజుల గడువు ఇచ్చారు. ఈ 28 రోజుల్లో, చాట్‌బాట్ ఇచ్చిన సమాచారాన్ని కంపెనీ వివరణతో పాటు మార్చాల్సి ఉంటుంది. 

విషయం ఏమిటి

గత నవంబర్‌లో, మెల్‌బోర్న్‌కు వాయువ్యంగా 120 కి.మీ దూరంలో ఉన్న హెప్బర్న్ షైర్‌కు మేయర్‌గా ఎన్నికైన బ్రియాన్ హుడ్, విదేశీ లంచాల కుంభకోణంలో నిందదితుడని చాట్‌ జిపిటి పేర్కొంది. దీంతో ఆయన ప్రతిష్టకు భంగం కలిగింది.  చాట్ జీపీటీ చాట్‌బాట్ తన గురించి తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆస్ట్రేలియా ప్రాంతీయ మేయర్ బ్రియాన్ హుడ్ అన్నారు. చాట్‌బాట్‌  మేయర్‌ను లంచం తీసుకునే వ్యక్తిగా పేర్కొంది. దీంతో ఆయన  ప్రతిష్టను దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాదు మేయర్ కూడా లంచం కేసులో జైలు పాలయ్యాడని చాట్ జీపీటీ పేర్కొంది. 

అయితే తాను తన జీవితంలో ఎప్పుడూ జైలుకు వెళ్లలేదని బ్రియాన్ హుడ్ స్పష్టం చేశారు. చాట్‌బాట్ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని అన్నారు. మరోవైపు, చాట్‌బాట్‌ల ఇలాంటి సమాచారం ఇవ్వడంతో అటు ఆస్ట్రేలియా ప్రాంతీయ మేయర్లు ఆందోళన చెందుతున్నారు. 

OpenAIకి లేఖ రాసిన బ్రియాన్ హుడ్ 

కొంతమంది పబ్లిక్ సభ్యులు దీని గురించి బ్రియాన్ హుడ్‌కి తెలియజేశారు, ఆ తర్వాత అతను మార్చి 21న ChatGPT సృష్టికర్త OpenAIకి  ఓ లేఖను రాశాడు. చాట్‌బాట్ ఇచ్చిన సమాచారం సరిదిద్దకపోతే, కంపెనీకి వ్యతిరేకంగా దావా వేయవచ్చు. అయితే, హుడ్ చట్టపరమైన లేఖపై శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన OpenAI ఇంకా స్పందించలేదు.

బ్రియాన్ హుడ్ న్యాయ సంస్థ గోర్డాన్ లీగల్ భాగస్వామి జేమ్స్ నౌటన్, రాయిటర్స్‌తో మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు , IT స్పేస్‌లో ప్రచురించే తప్పుడు సమాచారం వల్ల చాలా నష్టం జరుగుతోందని, అందుకే ఇలాంటి కేసుల్లో యాంటీట్రస్ట్ చట్టాన్ని వర్తింపజేయడానికి ఇది ఒక "చారిత్రక క్షణం" అని అన్నారు. బ్రియాన్ హుడ్ ఎన్నికైన అధికారి అయినందున, అతడి ప్రతిష్ట చాలా విలువైనదని పేర్కొంది.