Asianet News TeluguAsianet News Telugu

సోమవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ యాక్షన్ కు అవకాశం..కారణం ఇదే..

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇది మీకు శుభవార్త అని చెప్పవచ్చు. సోమవారం ట్రేడింగ్ మొదటి రోజే అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ యాక్షన్ కనిపించే అవకాశం ఉంది.

Chance of huge action in the shares of Adani group companies on Monday..this is the reason MKA
Author
First Published Sep 10, 2023, 11:03 PM IST

అదానీ గ్రూప్ కంపెనీకి సంబంధించిన వార్తలు కంపెనీ షేర్లపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. అసలు విషయం ఏంటంటే.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో ప్రమోటర్లు అదనంగా 2 శాతం వాటాను కొనుగోలు చేశారు. దీంతో ప్రమోటర్ల వాటా 69.87 శాతం నుంచి 71.93 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆగస్టులో కూడా ప్రమోటర్ గ్రూప్ 2.2 శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పుడు కంపెనీ తన వాటాను 67.65 శాతం నుంచి 69.87 శాతానికి పెంచింది. గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీలో ప్రమోటర్లు తమ వాటాను పెంచుకోవడం నెల వ్యవధిలో ఇది రెండోసారి కావడం విశేషం. 

గత శుక్రవారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 0.47 శాతం లాభంతో బిఎస్‌ఇలో రూ.2520.20 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 0.38 శాతం పెరిగి రూ. 2,519 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2,87,303 కోట్లుగా నమోదవడం విశేషం. 

ఇది కాకుండా, ప్రమోటర్ గ్రూప్ అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌లో తన వాటాను 63.06 శాతం నుండి 65.23 శాతానికి పెంచుకుంది. రిసర్జెంట్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్ ఓపెన్ మార్కెట్ నుండి అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్‌లో సుమారు ఒక శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇది కాకుండా, మరో 1.2 శాతం వాటాను ఎమర్జింగ్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ DMCC కొనుగోలు చేసింది.  

అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గత కొంత కాలంగా పుంజుకుంటున్నాయి. అమెరికన్ షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24, 2023న విడుదల చేసిన నివేదికలో అదానీ గ్రూప్ అకౌంటింగ్ ఫ్రాడ్  మానిప్యులేషన్‌ లను ఆరోపించినప్పుడు. దీని తర్వాత అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లలో భారీ పతనం కనిపించింది. అదానీ గ్రూప్‌కు చెందిన చాలా కంపెనీల షేర్లలో ప్రతిరోజూ లోయర్ సర్క్యూట్‌లు కనిపించాయి. దీంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోవాల్సి వచ్చింది.

ఈ కారణంగా, అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 150 బిలియన్ డాలర్లు తగ్గింది. అయితే, ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో కొంత మెరుగుదల కనిపించింది. షేర్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. అయితే, ఇప్పుడు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో కొంత మెరుగుదల కనిపించింది. షేర్లు మళ్లీ పెరుగుతున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios