ప్రస్తుతం అదానీ గ్రూప్ చైర్మన్ సంపద ఈ ఏడాదిలో 17.1 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఇప్పుడు అతను ప్రపంచంలో 25వ ధనవంతుడిగా అవతరించారు.

భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ చైనా వ్యాపారవేత్త జాక్ మాను ఆదాయాల పరంగా అధిగమించారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ చైర్మన్ సంపద ఈ ఏడాదిలో 17.1 బిలియన్ డాలర్లు పెరిగింది.

దీంతో బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఇప్పుడు అతను ప్రపంచంలో 25వ ధనవంతుడిగా అవతరించారు. ప్రస్తుతం ఆయన మొత్తం సంపద 50.9 బిలియన్ డాలర్లు. అలాగే అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా ఈ జాబితాలో 26వ స్థానంలో ఉన్నారు. 2021లో ఇప్పటివరకు అతని సంపద భారీగా పడిపోవడంతో ఇప్పుడు 50.2 బిలియన్ల డాలర్లకు చేరింది.


ముకేష్ అంబానీ సంపద
 ఈ సంవత్సరం గౌతమ్ అదానీ సంపదలో అతిపెద్ద పెరుగుదల నమోదైంది. అదానీ పోర్టుల నుండి ఇంధన వ్యాపారం వరకు పెట్టుబడిదారుల విశ్వాసం పెరగడమే దీనికి కారణం.

also read రేంజ్ రోవర్ కార్, ఐఫోన్ వాడుతున్న పతంజలి సి‌ఈ‌ఓ గురించి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు.. ...

ఈ కాలంలో ఆసియాలో అత్యంత ధనవంతుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ సంపద కూడా 5.08 బిలియన్ డాలర్లు పెరిగింది. ముకేష్ అంబానీ మొత్తం సంపద 81.8 బిలియన్ డాలర్లు. అలాగే ముకేష్ అంబానీ ప్రపంచంలో 10వ ధనవంతుడు.

బ్లూమ్‌బెర్గ్ ఇండెక్స్ ప్రకారం 2021 మార్చి 17 నాటికి టాప్ 10 బిలియనీర్లు ఎంత సంపాదించారో తెలుసుకోండి

సంఖ్య పేరు మొత్తం సంపద(డాలర్లలో) పెరుగుదల/ తగ్గుదల దేశం పరిశ్రమ
1. జెఫ్ బెజోస్ 182 బిలియన్లు -8.72 బిలియన్లు అమెరికా టెక్నాలజి 
2. ఎలోన్ మస్క్ 175 బిలియన్ +5.10 బిలియన్ అమెరికా టెక్నాలజి 
3. బిల్ గేట్స్ 140 బిలియన్లు +8.24 బిలియన్ అమెరికా టెక్నాలజి 
4. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 125 బిలియన్లు +10.5 బిలియన్లు ఫ్రాన్స్ కన్జ్యూమర్ 
5. మార్క్ జుకర్బర్గ్ 106 బిలియన్లు +2.35 బిలియన్లు అమెరికా టెక్నాలజి 
6. వారెన్ బఫే 96.4 బిలియన్లు +8.75 బిలియన్లు అమెరికా డైవర్సిఫైడ్ 
7. లారీ పేజీ 96 బిలియన్లు +13.6 బిలియన్ అమెరికా టెక్నాలజి 
8. సెర్గీ బ్రిన్ 92.8 బిలియన్లు +13 బిలియన్లు అమెరికా టెక్నాలజి 
9. స్టీవ్ బాల్మెర్ 85.8 బిలియన్లు +5.42 బిలియన్లు అమెరికా టెక్నాలజి 
10. ముకేష్ అంబానీ 81.8 బిలియన్లు +5.08 బిలియన్ భారతదేశం ఎనర్జి