ప్రతినెల పెన్షన్ ఒక లక్ష రూపాయలు కావాలా అయితే ఎల్ఐసి వారి ఈ పథకంలో ఒక్కసారి ప్రీమియం కడితే చాలు ప్రతినెలా లక్ష రూపాయల వరకు పెన్షన్ పొందే అవకాశం ఉంది. ఈ స్కీంకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వయసు మీద పడ్డ వారికి పెన్షన్ సౌకర్యం అనేది తప్పనిసరి ఎందుకంటే వారు కష్టపడి పని చేయడం చాలా కష్టం అవుతుంది కనుక నెలవారి పెన్షన్ సౌకర్యం ఉన్నట్లయితే, ముసలి వయస్సులో ఆర్థిక భద్రతతో జీవించే అవకాశం ఉంటుంది లేకపోతే ఎన్నో కష్టాల బారిన పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆయా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెన్షన్ చెల్లిస్తాయి. కానీ ప్రైవేటు ఉద్యోగం చేసే వారికి పెన్షన్ సదుపాయం ఉండదు. అలాంటి వారి కోసం ఎల్ఐసి ఓ చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టింది దానికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోరుకునే వారి కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) కొన్ని వినూత్న పథకాలను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగుల కోసం అనేక పథకాలు ఉన్నాయి. నెలవారీ పెన్షన్ ద్వారా ఉపశమనం పొందాలనుకునే వారి కోసం ఎల్‌ఐసి జీవన్ శాంతి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద, నెలవారీ పెన్షన్ LIC యాన్యుటీ రేట్లను ఇటీవల పెంచడంతో, పాలసీదారులు ఇప్పుడు వారి ప్రీమియంతో మరింత ఎక్కువ పెన్షన్ పొందుతారు.
LIC జీవన్ శాంతి పథకం నెలవారీ, అర్ధ వార్షిక, వార్షిక లేదా త్రైమాసిక ఆదాయం కోరుకునే వారి కోసం రూపొందించబడింది. త్వరగా పదవీ విరమణ చేయాలనుకునే వారు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు. పాలసీదారులు ఒకే ప్రీమియంతో తమ లక్ష్యాలను సాధించవచ్చు.
ప్రత్యేకత ఏమిటంటే పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. మీరు కోరుకున్న నెలవారీ ఆదాయం ఆధారంగా మీకు కావలసినంత పొందవచ్చు. LIC కాలిక్యులేటర్ ప్రకారం, మీకు పెద్ద నెలవారీ పెన్షన్ మొత్తం కావాలంటే మీరు భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించాలి.
అంటే నెలకు రూ.1 లక్ష పెన్షన్ కావాలంటే 12 ఏళ్లకు రూ.1 కోటి పెట్టుబడి పెట్టాలి. 12 ఏళ్ల తర్వాత మీకు నెలకు రూ.1.06 లక్షల పెన్షన్ వస్తుంది. మీరు కేవలం 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే, మెచ్యూరిటీపై నెలకు రూ.94,840 పెన్షన్ పొందుతారు. నెలకు రూ.50000 పింఛను ఇస్తే చాలు అనుకుంటే రూ.50 లక్షలు పెట్టుబడి పెట్టండి. 12 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే నెలకు రూ.53,460 పెన్షన్ వస్తుంది.
