పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తున్నారు.


Union Budget 2025-26 లైవ్ అప్ డేట్స్, హైలెట్స్, కీ పాయింట్స్, ఇతర ముఖ్యాంశాలు. మీకు ఈ బడ్జెట్ విశేషాలను అందిస్తున్న వారు అరుణ్ కుమార్ పటోళ్ల. నరేందర్ వైట్ల.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ప్రసంగిస్తున్నారు.

గోల్డ్ దిగుమతులు పెరగడంతో విదేశీ మారకద్రవ్యంపై ఒత్తిడి పెరుగుతోంది.ఇది రూపాయి పతనానికి ఆజ్యం పోస్తోంది. జువెలరీ పరిశ్రమ సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. మోవైపు బంగార కారణంగా జీడీపీకి అదనపు విలువ జోడింపు లేదా ఎగుమతుల్లో వృద్ధి కూడా పెద్దగా కనిపించకపోవడం ప్రభుత్వాన్ని నిరాశకు గురిచేసింది. దీనికి తోడు బంగారాన్ని బాగా దిగుమతి చేసుకోవడం ద్రవ్యలోటు, కరెన్సీ పతనానికి దారితీస్తోంది. ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.87 వద్దకు చేరడానికి గల కారణాల్లో ఇది కూడా ఒకటి. దీంతో ఈ బంగారంపై బంగారంపై భారీగా పన్నులు, సుంకాల వడ్డింపు ఉంటుదని భావిస్తున్నారు. మరింత చదవండి
బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి President Droupadi Murmu ప్రసంగిస్తున్నారు. రాష్ట్రపతి ప్రసంగం పూర్తయిన తర్వాత ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ సమవేశాలు మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారో ఈ వీడియోలో చూడండి.
ఇండియన్ రైల్వేని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంతోపాటు పెరుగుతున్న అవసరాలకు తగినట్లు పరుగెత్తించాలంటే.. ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా లేదా మార్చాలా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలో రైల్వేకి ఎటువంటి ప్రణాళికలను అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
చిన్న మొత్తాల పొదుపు పథకాలకు అధిక వడ్డీని ఇచ్చే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే ఇది కొనసాగుతుందా లేదా అనేది ఈ బడ్జెట్ లో సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే దీనికి మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు ‘ఆజాది కా అమృత్ మహోత్సవం’ సందర్భంగా 2023-24 సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టారు.
నేటి నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ భారత ఎకనమిక్ సర్వేను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం వుంటుంది.