న్యూ ఢీల్లీ: ఫ్యూచర్‌గ్రూప్‌ స్టోర్స్‌, ఫ్యాషన్ డిస్కౌంట్ చైన్ బ్రాండ్ ఫ్యాక్టరీ భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఆఫర్‌ను ప్రకటించింది. బ్రాండ్ ఫ్యాక్టరీ  నేషనల్ బ్రాండ్ వీక్‌తో జరుపుకుంటుంది, ఇందులో ఆగస్టు 11 నుండి ఆగస్టు 15 వరకు అన్ని ప్రధాన బ్రాండ్‌లపై 50% తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

బ్రాండ్‌ ఫ్యాక్టరీలో ‘‘2 కొంటే 3 ఉచితం’’ ఆఫర్‌ను ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్ట్‌ 16వరకు కొనసాగే ఈ ఆఫర్‌లో భాగంగా 200కు పైగా విదేశీ, దేశీయ బ్రాండ్లను తక్కువ ధరకే అందిస్తున్నట్లు పేర్కొంది. కస్టమర్ల భద్రతను దృష్టిలో పెట్టుకొని అసిస్టెడ్‌ షాపింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు బ్రాండ్‌ ఫ్యాక్టరీ సీఈవో సురేష్‌ నద్వానీ తెలిపారు.  

also read కరోనా వారి ఆలోచనలను మార్చేసింది.. అక్కడ భారీగా పెరిగిన ఫాస్ట్‌టాగ్ లావాదేవీలు.. ...

ఇందుకు కస్టమర్లు 7506313001కి మిస్‌కాల్‌ ఇచ్చి అపాయింట్‌ను బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని నద్వానీ పేర్కొనారు. స్వాతంత్ర్య దినోత్సవ కాంపైన్ అన్ని స్టోర్లలలో ఐదు రోజులు ఉంటుంది, దీనిలో వినియోగదారులకు అన్ని దుస్తులపై 50% తగ్గింపుతో పాటు 3 దుస్తుల కొనుగోలుపై అదనపు 20% తగ్గింపు లభిస్తుంది.

"అన్ని బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్లలో నేషనల్ బ్రాండ్స్ వీక్ కాంపైన్ గురించి మేము నిజంగా సంతోషిస్తున్నాము. బ్రాండ్ ఫ్యాక్టరీ వద్ద వినియోగదారులకు అన్నీ బ్రాండ్లు, అన్నీ వర్గాలకు ఖచ్చితంగా గొప్ప ధరలకు అందిస్తుంది. ”అని బ్రాండ్ ఫ్యాక్టరీ వ్యాపార హెడ్ సురేష్ సాధ్వానీ అన్నారు.