పిసిబి తయారీలో బిపిఎల్ భారీ పెట్టుబడులు ... బెంగళూరు లో అత్యాధునిక ప్లాంట్
బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న బిపిఎల్ సంస్థ భారీ పెట్టుబడులతో ఎలక్ట్రానిక్ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
బెంగళూరు. భారతీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న బిపిఎల్ లిమిటెడ్ భారీ పెట్టుబడులతో ముందుకు వచ్చింది. బెంగళూరులో అత్యాధునిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంకోసం ఈ పెట్టుబడులను ఉపయోగించుకుంది. ఇది భారతదేశంలోని పిసిబి సెక్టార్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ విభాగంలో డిమాండ్‌ను తీర్చడంలో ఇది సహాయపడుతుంది.
బిపిఎల్ సంస్థ ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడంలో... అంతర్జాతీయ స్థాయిలో నిలబెడేలా చేస్తోంది. ఈ క్రమంలో కంపెనీ కొత్త ప్లాంట్ ఏర్పాటు చేసింది.ఇది 100k క్లాస్ క్లీన్ రూమ్, అధునాతన ప్లేటింగ్ లైన్‌లు మరియు సీఎన్సీ నియంత్రిత యంత్రాలను కలిగి ఉంది. ఇది భారత ప్రభుత్వం యొక్క 'మేక్ ఇన్ ఇండియా' చొరవకు నిదర్శనంగా నిలిచింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో పిసిబిలకు పెరుగుతున్న డిమాండ్ ను ఇది తీర్చనుంది.
బిపిఎల్ కొత్త ప్లాంట్ విశేషాలు :
క్లాస్ 100k క్లీన్ రూమ్: అధిక నాణ్యత గల పిసిబి ఉత్పత్తి కోసం అత్యధిక శుభ్రతా ప్రమాణాలు పాటిస్తున్నారు.
అడ్వాన్స్ ప్లేటింగ్ లైన్స్: ఇందులో ఉత్తమమైన కాపర్ వినియోగం చాలా ముఖ్యమైనది. పిసిబి యొక్క మంచి పనితీరు కోసం ఇది అవసరం.
సీఎన్సి నియంత్రిత యంత్రాలు: పిసిబి తయారీలో ఖచ్చితత్వం మరియు సమర్థత హామీ ఇస్తాయి.
మరిన్ని విభాగాలు: ఆర్ఎఫ్ యాంటెన్నా, ఆటోమోటివ్ మరియు పవర్ కన్వర్షన్ వంటి నిర్దిష్ట విభాగాలను లక్ష్యంగా చేసుకున్నారు.
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెస్ట్ సదుపాయం: ఇందులో మైక్రో-సెక్షన్ ఎనలైజర్‌లు, 500x వరకు మైక్రోస్కోప్‌లు మరియు కఠినమైన పిసిబి పరీక్షల కోసం అత్యాధునిక పరీక్ష గది ఉన్నాయి.
వీడియో
భారతీదేశంలో పిసిబి మార్కెట్ వేగంగా పెరుగుతోంది. సిఎజిఆర్ 2024 నుండి 2032 వరకు 18.1% గా అంచనా వేస్తున్నారు.2032 నాటికి 20.17 బిలియన్ల (అమెరికన్ డాలర్) చేరుకుంటుందని అంచనా. దీన్ని దృష్టిలో ఉంచుకుని బిపిఎల్ ఈ రంగంలో తన సామర్థ్యాన్ని విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో స్వదేశీ తయారీ మరియు స్వావలంబనను కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
జపాన్ సాంకేతిక మద్దతుతో 1989 నుండి పిసిబి తయారీలో బిపిఎల్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.15 కోట్లతో బిపిఎల్ కంపనీ ప్రస్తుత ప్లాంట్‌ను ఆటోమేటెడ్ మెషీన్‌లతో అప్‌గ్రేడ్ చేసింది.
కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు బిపిఎల్ కట్టుబడివుంది. అందుకోసమే తమ ప్రాడక్ట్ వినియోగదారుల వరకు చేరేందుకు తక్కువ సప్లై చెయిన్ వాడుతోంది... తద్వారా వినియోగదారుడిపై అధిక భారం పడకుండా చూస్తున్నారు. ధరలోనే కాదు క్వాలిటీలోనూ ఎలాంటి తేడా రాకుండా బిపిఎల్ జాగ్రత్త పడుతోంది.