రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం వచ్చే ఏడాది బ్యాంకులకు 40 రోజులకు పైగా హాలిడేస్ నమోదు కానున్నాయి. భారతదేశంలో బ్యాంకుల సెలవులు, మీరు నివసిస్తున్న రాష్ట్రంపై ఆధారపడి ఉంటాయి.

భారతదేశంలో వివిధ రకాల సెలవులను ప్రకటించింది. ఇందులో పరిమితం చేయబడిన సెలవులు, గెజిటెడ్ సెలవులు కూడా ఉన్నాయి. గెజిటెడ్ లేదా పబ్లిక్ హాలిడేస్ దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు వర్తిస్తాయి.

వీటిలో గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర్య దినోత్సవం, గాంధీ జయంతి ఉన్నాయి. ఇవి కాకుండా దీపావళి, దసరా, క్రిస్మస్, ఈద్, గురు నానక్ జయంతి, గుడ్ ఫ్రైడే, గణేష్ చతుర్థి, బుద్ పూర్ణిమ వంటి ముఖ్యమైన మతపరమైన అలాగే పండుగ సెలవులు ఉన్నాయి.

ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. 2021లో ప్రధాన బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా మీకోసం..

జనవరి 2021లో 
26 జనవరి (మంగళవారం) - గణతంత్ర దినోత్సవం

మార్చి 2021లో 
11 మార్చి (గురువారం) - మహా శివరాత్రి / శివరాత్రి
29 మార్చి (సోమవారం) - హోలీ

ఏప్రిల్ 2021లో 
1 ఏప్రిల్ (గురువారం) - ఖాతాల ముగింపు రోజు
2 ఏప్రిల్ (శుక్రవారం) - గుడ్ ఫ్రైడే
14 ఏప్రిల్ (బుధవారం) - అంబేద్కర్ జయంతి
25 ఏప్రిల్ (ఆదివారం) - మహావీర్ జయంతి

also read మీరు పాస్‌పోర్ట్ కోసం అప్లయ్ చేస్తున్నారా జాగ్రత్త.. వీటి గురించి తెలుసుకోండి.. లేదంటే ? ...

మే 2021 లో బ్యాంక్ సెలవులు
13 మే (గురువారం) - రంజాన్-ఐడి / ఇద్-ఉల్-ఫితార్

జూలై 2021 లో బ్యాంక్ సెలవులు
20 జూలై (మంగళవారం) - బక్రీద్‌ 

ఆగస్టు 2021 లో 
15 ఆగస్టు (ఆదివారం) - స్వాతంత్ర్య దినోత్సవం
19 ఆగస్టు (గురువారం) - మొహర్రం
30 ఆగస్టు (సోమవారం) - జన్మష్టమి

సెప్టెంబర్ 2021 లో
సెప్టెంబర్ 10 (శుక్రవారం) - గణేష్ చతుర్థి

అక్టోబర్ 2021 లో 
అక్టోబర్ 2 (శనివారం) - మహాత్మా గాంధీ జయంతి
15 అక్టోబర్ (శుక్రవారం) - దసరా

నవంబర్ 2021 లో
4 నవంబర్ (గురువారం) - దీపావళి
19 నవంబర్ (శుక్రవారం) - గురు నానక్ జయంతి

డిసెంబర్ 2021 లో
25 డిసెంబర్ (శనివారం) - క్రిస్మస్