వైరల్ వీడియో : ఆడి కారులో టీ.. చూసి షాక్ అయిన జనం.. ఆశ్చర్యానికి గురిచేస్తున్న చాయ్ వాలా..
ఆడి కార్లు ధనవంతుల కోసం అని అనుకుంటునతరు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కొన్ని సందేహాలకు తావిస్తోంది. ఈ వ్యక్తి ఆడి కారు కొన్నాకా టీ అమ్ముతున్నాడా లేక టీ అమ్మి ఆడి కారు కొన్నాడా అనే ప్రశ్నకు సమాధానం లేదు.
ప్రజలు పని చేయాలనుకుంటే ఏదైనా చేస్తారు. ఈరోజుల్లో చదువుకు తగ్గ ఉద్యోగం దొరకడం కష్టమైన పనే అని చెప్పాలి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూడడం కొందరికి ఇష్టం లేక కొత్త మార్గాల్లో డబ్బు సంపాదిస్తున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ కి ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఫాస్ట్ ఫుడ్, టీ, కాఫీలతో సహా ఫుడ్ బిజినెస్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఏదైనా మార్కెట్ ఏరియాలో కేవలం టీ, కాఫీలు అమ్ముతూ జీవనం సాగించే వారు చాలా మంది ఉన్నారు.
ప్రస్తుతం కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు MBA చాయ్ వాలా గురించి వినే ఉంటారు. టీ అమ్ముతూ రూ.4 కోట్ల టర్నోవర్ చేసే 25 ఏళ్ల యువకుడిని ఎంబీఏ చాయ్ వాలా అంటారు. కొద్ది రోజుల క్రితం ఓ యువతి పానీపూరీ అమ్ముతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పుడు మరో వీడియో వైరల్ అవుతుంది. ఈ వైరల్ వీడియోలో ఉన్న వ్యక్తిని ఆడి చాయ్‌వాలా అని పిలవవచ్చు. ఈ వీడియోను ఆశిష్ త్రివేది తన ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్ లో షేర్ చేశారు. అందులో ఆడి కారులో టీ అమ్ముతున్న వ్యక్తిని మీరు చూడవచ్చు.
సోషల్ మీడియాలో ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్న చాయ్ వాలాకి ఆడి కారు ఉంది. ఆడి కార్ ఒక లగ్జరీ కార్ కంపెనీ అని మీకు తెలిసిందే. చాలామంది ఆడి కార్ కొనాలని కలలు కంటారు. లక్షలాది రూపాయలు అప్పు చేసి కూడా ఆడి కార్లను కొంటుంటారు. కష్టపడి సంపాదించిన కారును ఎవరైనా చిన్నపిల్లాడిలా చూసుకుంటారు. చిన్న గీత తగిలినా నిద్ర పట్టదు. అయితే ఇక్కడ ఓ వ్యక్తి టీ అమ్మేందుకు ఆడి కారును ఉపయోగిస్తున్నాడు. రోడ్డు పక్కన ఆగి ఉన్న ఆడి కారు వెనక టీ అమ్మే చిన్న స్టూల్ ఉంది. కొంతమంది టీ స్టాల్ దగ్గర నిలబడి టీ తాగుతుంటారు. ఈ పోస్ట్‌ను ashishtrivedii_24 అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసారు. ఆడి కారు ఉన్నా టీ అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందా లేక టీ అమ్మి ఆడి కారు కొన్నారా అన్నది అందరి ప్రశ్న.
ఈ వీడియోను ఇప్పటివరకు సోషల్ మీడియాలో 26 లక్షల మంది చూశారు. కామెంట్స్‌లో జనాలు అతన్ని ఆడి చాయ్‌వాలా అని కూడా పిలుస్తున్నారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు 70 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. కారులో కూర్చొని టీ తాగితే 100 రూపాయలు ఖర్చవుతుందని ఓ వ్యక్తి చెప్పగా, టీ అమ్మడం మంచి బిజినీస్ అని మరొకరు కామెంట్ చేశారు. కొద్ది రోజుల క్రితం బీహార్ విద్యార్థి టీ స్టాల్ వార్తల్లో నిలిచింది. ఫరీదాబాద్‌లో బీటెక్ చాయ్ వాలీ పేరుతో బీటెక్ విద్యార్థి టీ విక్రయిస్తున్నాడు.