Asianet News TeluguAsianet News Telugu

సువర్ణ న్యూస్ ఇప్పుడు బోల్డ్ అండ్ సరికొత్తగా ఏషియనెట్ సువర్ణ న్యూస్

ఈ ప్రకటనతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సుదీర్ఘకాల ప్రాంతీయ, జాతీయ ఈక్విటీని సువర్ణ న్యూస్‌కు తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ‘స్ట్రెయిట్, బోల్డ్ అండ్ రిలెంట్‌లెస్’ అనే ట్యాగ్‌లైన్‌తో రీబ్రాండెడ్ ఛానెల్ కొత్త కార్యక్రమాలతో కన్నడ వార్తా ప్రసార పరిశ్రమలో లీడింగ్ రేసులో మరిన్ని లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Asianet Suvarna News is the new, bold, exciting avatar  of Suvarna News
Author
Hyderabad, First Published Nov 30, 2020, 4:56 PM IST

కర్ణాటకకు ఇష్టమైన న్యూస్ ఛానల్, గత 12 సంవత్సరాలుగా విజయవంతమైన ప్రాంతీయ వార్తా ప్రసార ఛానల్ సువర్ణ న్యూస్ ఇప్పుడు  ఏషియనెట్ సువర్ణ న్యూస్ గా పేరు మార్చబడింది. ఈ ప్రకటనతో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ సుదీర్ఘకాల ప్రాంతీయ, జాతీయ ఈక్విటీని సువర్ణ న్యూస్‌కు తీసుకురావాలనే ఉద్దేశ్యాన్ని సూచిస్తుంది. ‘స్ట్రెయిట్, బోల్డ్ అండ్ రిలెంట్‌లెస్’ అనే ట్యాగ్‌లైన్‌తో రీబ్రాండెడ్ ఛానెల్ కొత్త కార్యక్రమాలతో కన్నడ వార్తా ప్రసార పరిశ్రమలో లీడింగ్ రేసులో మరిన్ని లక్ష్యాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ఏషియానెట్ న్యూస్ మీడియా & ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సి‌ఈ‌ఓ అభినవ్ ఖరే మాట్లాడుతూ “సువర్ణ న్యూస్ లోకల్ ప్రాంతంలో బలమైన ప్లేయర్ గా వేగంగా అభివృద్ధి చెందింది. వార్తా ప్రసారంలో లీడర్ షిప్ స్థాపించింది. ఈ బ్రాండ్ రాష్ట్రంలో ఇంకా ప్రజలలో కీలకమైనది, ఎందుకంటే  తెలివైన ఇంకా ప్రభావవంతమైన రిపోర్టింగ్ ద్వారా దేశపౌరులను శక్తివంతం చేస్తుంది. ఆసియానెట్ న్యూస్‌ను దాని గుర్తింపులో చేర్చడంతో ఆసియనెట్ సువర్ణ న్యూస్ మంచి రీకాల్, ఆసియానెట్ న్యూస్ నెట్‌వర్క్ జాతీయ ప్రయోజనాన్ని, మరీ ముఖ్యంగా ఇది లోకల్  ప్రాంతంలో బలమైన విశ్వసనీయతను ఏర్పాటు చేస్తుంది ”

ఏషియనెట్ సువర్ణ న్యూస్ ఎడిటర్-ఇన్-చీఫ్ రవి హెగ్డే మాట్లాడుతూ “కర్ణాటక న్యూస్ జెన్రేలో గేమ్ ఛేంజర్‌గా ఉండే ప్రైమ్ టైమ్‌లో కొత్త షోలను ప్రవేశపెట్టడంతో పాటు కొత్త గుర్తింపు ఉత్తేజకరమైన, పునరుద్దరించిన రూపాన్ని, అనుభూతిని కలిగించింది. జర్నలిజం అనే దానికి అవసరమయ్యే వాటికి మేము అదే శ్రద్ధ చూపుతాము. కాపీ-క్యాట్ న్యూస్ మీడియా మార్కెట్లో స్ట్రెయిట్-బోల్డ్-రిలెంట్లెస్ అనే మా ట్యాగ్‌లైన్‌కు నిజమైన, ధృవీకరించిన దృశ్య ప్రదర్శనతో వేరు చేస్తాము. ”

ఏషియానెట్ న్యూస్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా న్యూస్ బ్రాడ్కాస్టింగ్ వ్యాపారంలో ప్రోగ్రామింగ్ డిఫరెన్షియేటర్స్ లేకపోవడాన్ని ఎత్తిచూపారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు కన్జూమర్లలో మార్పును మేము చూస్తున్నాము. న్యూస్ బ్రాడ్‌కాస్టర్ ఈ మార్పుకు సున్నితంగా ఉండటం చాలా ముఖ్యం. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న వీక్షకుల ప్రవర్తనతో, పూర్తి విభిన్నమైన కంటెంట్‌ను ప్రదర్శించడం కీలకం. ఏషియనెట్ సువర్ణ న్యూస్ సరిగ్గా ఆ పని చేస్తోంది, బాగా పరిశోధించిన కంటెంట్ స్ట్రాటజీతో కొనసాగుతుంది ”.


ఏషియానెట్ న్యూస్ మీడియా & ఎంటర్టైన్మెంట్ భారతదేశంలోని అత్యంత ప్రముఖ మీడియా సమ్మేళనాలలో ఒకటి. ఏషియానెట్ న్యూస్ అనేది రెండు దశాబ్దాలుగా తిరుగులేని నంబర్ 1 మలయాళ బ్రాడ్‌కాస్ట్ న్యూస్ ఛానల్. కర్ణాటకలో ఆసియానెట్ సువర్ణ న్యూస్ ప్రాంతీయ స్థాయి వార్తా కథనంలో ఒక ప్రత్యేకమైన లీడర్, కన్నడ ప్రభా వార్తాపత్రిక కర్ణాటకలో విశ్వసనీయ ముద్రణ జర్నలిజం 50 సంవత్సరాల వారసత్వాన్ని కలిగి ఉంది. ఇండిగో మ్యూజిక్.కామ్ భారతదేశంలో మొట్టమొదటి అంతర్జాతీయ రేడియో స్టేషన్, ఇది కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో బెంగళూరు & గోవాలో ఉంది.

 7 బాషలలో (మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు & బంగ్లా)ప్రతి నెల  10 లక్షల పేజీ వ్యూస్ తో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ డిజిటల్ ప్రాపర్టీ www.asianetnews.com దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్థానిక వేదికగా గుర్తించబడింది. సువర్ణ న్యూస్‌ను ఆసియనెట్ సువర్ణ న్యూస్‌కు రీబ్రాండ్ చేయడం ఉత్తమ పద్ధతులను, సంపాదకీయ నైపుణ్యాన్ని అందిస్తుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి: కిరణ్ అప్పాచు - హెడ్, మార్కెటింగ్. kiranappachu@asianetnews.in

Follow Us:
Download App:
  • android
  • ios