పెట్రోల్ పోయించే ముందు జీరో చెక్ చేస్తున్నారా..అయితే జీరోతో పాటు ఈ నెంబర్ కూడా చెక్ చేయండి లేకపోతే భారీ నష్టం

మనం సాధారణంగా వాహనంలో పెట్రోల్ పోయించే ముందు,  పెట్రోల్ పోసే యంత్రంలో జీరో ఉందో లేదో ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ ఉంటాము.  అయితే దాంతో పాటు మరొక వేల్యూ కూడా చెక్ చేయాలని ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు చెబుతున్నారు అదేంటో దాన్ని ఎలా చెక్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 

Are you checking zero before filling petrol in cart..but do this number along with zero..otherwise huge loss MKA

మన బండిలో పెట్రోల్ నింపే ముందు ఫ్యూయల్ డిస్పెన్సర్ మెషీన్‌లో 'జీరో' ఉందా లేదా చూడటం సహజం. జీరో ఉందో లేదో చూడకపోతే మనం నష్టపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. జీరో చూడకపోతే మనకుతక్కువ మొత్తంలో పెట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే పెట్రోట్ పంపులో కేవలం జీరో మాత్రమే మనం మరొక అంకె కూడా చూడాలి. అదే డెన్సిటీ లేదా సాంద్రత.. ఇది నేరుగా పెట్రోల్, డీజిల్ స్వచ్ఛతకు సంబంధించినది. దీని ప్రమాణాలను ప్రభుత్వమే నిర్ణయించింది. ఈ డెన్సిటీ అనేది స్వచ్ఛత స్కేల్. మీరు దీన్ని ఎలా తనిఖీ చేయవచ్చో తెలుసుకుందాం. 

డెన్సిటీ అంటే ఏమిటి?
సరళమైన భాషలో చెప్పాలంటే పెట్రోల్, లేదా డీజిల్ ఉత్పత్తి మందాన్నే డెన్సిటీ అంటారు. డెన్సిటీ అనేది ఆయా మూలకాలకు సంబంధించిన నిర్దిష్ట పరిమాణం ద్వారా నిర్ణయిస్తారు. ఒక ఉత్పత్తిని తయారుచేయడం, అలాగే దాానిలో ఇతర రసాయనాలు కలపడం ద్వారా డెన్సిటీలో తేడా వస్తుంది. ఉదాహరణకు పెట్రోలులో వేరే ఇతర రసాయనాలను కలిపితే దాని డెన్సిటీ విలువ మారుతుంది. అప్పుడు మీరు పెట్రోల్ లో కల్తీ జరిగిందని గుర్తించవచ్చు. 

పెట్రోల్, డీజిల్ డెన్సిటీ ఎంత 
ప్రతి పదార్థానికి స్థిర డెన్సిటీ ఉంటుంది. ఇంధనం విషయంలోనూ అదే పరిస్థితి ఉంటుంది. ప్రభుత్వం తన ప్రమాణాలను నిర్ణయించింది. పెట్రోల్ స్వచ్ఛత సాంద్రత క్యూబిక్ మీటరుకు 730 నుండి 800 కిలోగ్రాములు (kg/m3) ఉంటుంది. అదే డీజిల్ స్వచ్ఛత సాంద్రత 830 నుండి 900 kg/m3 మధ్య ఉంటుంది. 

ఏదైనా పెట్రోల్ బంకులో పేర్కొన్న సంఖ్యల కంటే తక్కువ లేదా అంతకంటే ఎక్కువ పరిధి ఉంటే, దానిలో కల్తీ జరిగినట్లు స్పష్టంగా తెలుస్తుంది.సాధారణంగా పెట్రోల్‌లో ఇతర ద్రావాలను కలపడం ద్వారా కల్తీ జరుగుతుంది. ఇది వాహనాన్ని నష్టపరుస్తుంది. ఇంజన్ పాడవుతుంది. 

డెన్సిటీని మీరు పెట్రోల్ ఫిల్లింగ్ మెషీన్‌లో నేరుగా చూడవచ్చు. అంతే కాదు మనకు ఈ సమాచారం పెట్రోల్ రసీదుపై కూడా ఉంటుంది. అందుకే మీరు పెట్రోల్ రశీదు తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం, పెట్రోల్ స్వచ్ఛతను కొలిచే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంది.

మీరు పెట్రోల్ లేదా డీజిల్ డెన్సిటీని తనిఖీ చేయాలంటే, మీకు 500 ml జార్, హైడ్రోమీటర్, థర్మామీటర్, ASTM (అమెరికన్ సొసైటీ ఫర్ టెస్టింగ్ ఆఫ్ మెటీరియల్స్) ఎక్స్ చేంజ్ ఛార్జ్ అవసరం. ఏదైనా ద్రవం సాంద్రతను తనిఖీ చేయడానికి హైడ్రోమీటర్ మంచి సాధనం. అయితే ఈ వస్తువులన్నీ పెట్రోల్ బంకులో అందుబాటులో ఉన్నాయి. మీకు డెస్సిటీలో ఏదైనా తేడా అనిపిస్తే, సంబంధిత ఏజెన్సీకి ఫిర్యాదు చేసే నిబంధన కూడా ఉంది 

అంతే కాదు పెట్రోల్, డీజిల్ డెన్సిటీ ఎలా గుర్తించాలో ఇండియన్ ఆయిల్ స్వయంగా ఓ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది .

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios