Twitter New CEO Linda Yaccarino: ట్విట్టర్ నూతన సీఈవోగా లిండా యాకారినో నియామకం..సంచలనానికి తెరలేపిన మస్క్

ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ ఇప్పుడు ట్విట్టర్ కొత్త సీఈవోను ప్రకటించారు. ఎలోన్ మస్క్ తన స్థానంలో ఓ మహిళా ఎగ్జిక్యూటివ్‌ని సీఈవోగా నియమించుకున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, NBC యూనివర్సల్ అడ్వర్టయిజింగ్ హెడ్ లిండా యాకరినో ట్విట్టర్ సీఈవో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. 

Appointment of Linda Yaccarino as the new CEO of Twitter MKA

ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్నుడైన ఎలాన్ మస్క్ తన సంచలన నిర్ణయాలకు కార్పొరేట్ ప్రపంచంలో ప్రసిద్ధి చెందారు. ఇటీవల అతను ట్విట్టర్ పేరును X Corp గా మార్చాడు. ఇప్పుడు మస్క్ ట్విటర్ సీఈవో పదవిని వదులుకొని ఆ స్థానంలో కంపెనీకి కొత్త సీఈవోని కూడా నియమించారు. ఈ విషయాన్ని స్వయంగా మస్క్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. అతను తన ట్వీట్‌లో, 'నేను ట్విట్టర్‌కు కొత్త CEOని నియమించుకున్నట్లు ప్రకటించడానికి సంతోషిస్తున్నాను అని తెలిపారు. ఆమె 6 వారాల్లో పని ప్రారంభిస్తుంది. నా పాత్ర ఇప్పుడు కేవలం మేనేజ్ మెంట్ హెడ్ , అలాగే చీఫ్ట టెక్నికల్ ఆఫీసర్, CTO మాత్రమే అని మస్క్ తెలిపారు. అయితే, మస్క్ తన ట్వీట్‌లో కొత్త సీఈఓ పేరును పేర్కొనలేదు. కేవలం ఒక మహిళ అని మాత్రమే సూచించాడు.

వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం, మస్క్ ట్విట్టర్  కొత్త CEO స్థానం కోసం లిండా యాకారినోను నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె NBC యూనివర్సల్‌లో అడ్వర్టైజింగ్ హెడ్ గా ఉన్నారు. కాగా కొత్త సీఈవో పదవి వచ్చిన తర్వాత ఆమె ఆ పదవి నుంచి తప్పుకుంటారని మస్క్ ఇప్పటికే పేర్కొన్నాడు. ఎలోన్ మస్క్ అక్టోబర్‌లో 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆయనే స్వయంగా ట్విటర్‌ సీఈవో అయ్యారు. డిసెంబరులో, కొత్త సీఈవో దొరికిన తర్వాత తాను పదవి నుంచి వైదొలుగుతానని చెప్పారు. 

ఎవరీ.. యాకారినో…?

ట్విట్టర్ సీఈఓగా యాకారినో నియామకం పూర్తిగా ఎలాన్ మస్క్ ఇష్టం మేరకే ఎంపిక జరిగి ఉండవచ్చని  రాయిటర్స్ తన నివేదికలో పేర్కొంది. యాకారినో గత నెలలో మియామీలో మస్క్‌తో భేటీ అయ్యింది. యాకారినో 2011 నుండి NBC యూనివర్సల్‌లో ఉన్నారు. ఆమె ఆ కంపెనీలో గ్లోబల్ అడ్వర్టైజింగ్  పార్టనర్‌షిప్ హెడ్. దీనికి ముందు కేబుల్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో డిజిటల్, అడ్వర్టైజింగ్ సేల్స్ విభాగంలో పనిచేశారు. దీనికి ముందు, యాకారినో టర్నర్‌లో 19 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఆమె ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్/COO అడ్వర్టైజింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో పనిచేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios