ద్యావుడా..? 2008 నుంచి సిక్ లీవ్ పెట్టి ఏటా 55 లక్షల జీతం పొందుతున్న ఉద్యోగి..జీతం పెంచడం లేదని కేసు పెట్టాడు
ఒక కంపెనీ ఉద్యోగి అనారోగ్యం కారణంగా 15 ఏళ్లుగా సెలవులో ఉండి, ఇప్పటికీ ఏటా 55 లక్షల వేతనం పొందుతూ, తన జీతం పెంచలేదని కోర్టుకు వెళ్లాడు. ఈ షాకింగ్ కేసు IBM కంపెనీకి ఎదురైంది. మీడియా కథనాల ప్రకారం, ఈ కంపెనీలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి 2008 నుండి అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నాడు. తన జీతం పెంచకుండా కంపెనీ పై వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లాడు.
ఐబీఎం కంపెనీలో 2008 నుండి అనారోగ్యంతో సెలవుపై ఉన్న ఒక సీనియర్ IT ఉద్యోగి తనకు వేతనం పెంచలేదని, కంపెనీపై దావా వేశారు. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. IBM కంపెనీలో పనిచేస్తున్న ఇయాన్ క్లి ఫోర్డ్ గత 15 సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అతను 2013 నుండి 'వైద్యపరంగా రిటైర్డ్' అయ్యాడని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ పేర్కొని ఉంది.
అయితే, అతడికి గత 15 సంవత్సరాలుగా వేతనం అందుతోంది. కానీ అతడి వేతనం పెంచడం లేదు. దీంతో కంపెనీ తన వైకల్యం కారణంగా వివక్ష చూపుతోందని పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే నిజానికి ఇయాన్ IBM హెల్త్ ప్లాన్ కింద సంవత్సరానికి 54,000 పౌండ్ల (ఏడాదికి 55 లక్షల రూపాయల) కంటే ఎక్కువ సంపాదించడానికి హామీ పొందాడు. అంతేకాదు ఆయనకు 65 ఏళ్ల వయస్సు వరకు ఈ మొత్తం ఇవ్వాల్సి ఉంది. అయితే తనకు ప్రకటించిన హెల్త్ ప్లాన్ ''తగినంత ఉదారంగా లేదు'' అని అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఎందుకంటే ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయి. తన ఆదాయం తగ్గిపోతుందని ఐబీఎం కంపెనీపై సదరు ఉద్యోగి ఎదురుదాడి చేశాడు.
ఇదిలా ఉంటే క్లిఫోర్డ్ సెప్టెంబర్ 2008లో అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవు తీసుకున్నాడు. 2013లో అనారోగ్యం పరిస్థితి అలాగే కొనసాగింది. దీంతో సదరు ఉద్యోగి అప్పీలు చేసుకోగా, అతడి ఫిర్యాదుకు ప్రతిస్పందనగా, IBM "రాజీ ఒప్పందాన్ని" అందించింది. అందుబాలో భాగంగా కంపెనీ వైకల్య ప్రణాళికకు అతడిని జోడించారు. ప్రణాళిక ప్రకారం పని చేయలేని కార్మికుడిని తొలగించరు. బదులుగా, వారు ఇప్పటికీ ఉద్యోగులుగా పరిగణించబడతారు
కంపెనీ ఆమోదించిన ప్లాన్ లో నమోదు చేసుకున్న ఉద్యోగులు ఎవరైనా దీర్ఘకాలిక అనారోగ్యం, పదవీ విరమణ, లేదా మరణం, ఏది ముందుగా సంభవించినా అంగీకరించిన వేతనంలో 75 శాతం పొందేందుకు అర్హులు. ఇయాన్ క్లిఫోర్డ్ విషయంలో కూడా ఇదే జరిగింది. అతడి వేతనం 72,037 పౌండ్‌లు కాగా, అంటే 2013 నుండి అతను 25 శాతం తగ్గింపు తర్వాత 54,028 పౌండ్‌లను అందుకుంటున్నాడు. అతను 65 ఏళ్లు నిండే వరకు ఈ వేతనం పొందేందుకు అర్హుడు.
అతను ఫిబ్రవరి 2022లో IBMకుే వ్యతిరేకంగా వికలాంగ వివక్షను ఆరోపిస్తూ, ఉపాధి ట్రిబ్యునల్ ముందు దావా వేశారు. అయితే ఊహించని విధంగా న్యాయస్థానం ఇయాన్ క్లిఫోర్డ్ వాదనలను తిరస్కరించింది. న్యాయమూర్తి బాధితుడికి అనుకూలమైన చికిత్స, గణనీయమైన ప్రయోజనం లభించిందని పేర్కొన్నాడు.