న్యూ ఢీల్లీ: యు.కెలో కరోనా వైరస్ కంటే 70 శాతం అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ భయంతో భారత్‌తో సహా పలు దేశాలు యు.కె నుండి వచ్చే అన్ని విమానాలను డిసెంబర్ 31 వరకు తాత్కాలికంగా నిలిపివేసాయి.

"కొన్ని దేశాలలో కొత్త వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఏర్పడిన పరిస్థితుల ఫలితంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మేము నిర్ణయించుకున్నాము. యు.కె నుండి భారతదేశానికి వచ్చే అన్ని విమానాలు 22 డిసెంబర్ నుండి 31 డిసెంబర్ 2020 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు "సివియల్ ఏవియేషన్ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్వీట్ చేశారు.

డిసెంబర్ 22 లోపు యు.కె నుండి దేశానికి వచ్చే అన్ని విమానాలలోని ప్రయాణీకులకు కోవిడ్ -19 కోసం ఆర్‌టి-పిసిఆర్ పరీక్షను తప్పనిసరిగా చేయవలసి ఉంటుందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మరింత కఠినమైన జాగ్రత్తలు ఆదేశించింది. ఇప్ప‌టికే యూకే నుంచి బ‌య‌లుదేరిన విమానాలు లేదా డిసెంబ‌ర్ 22, రాత్రి 11.59 గంట‌ల‌లోపు వ‌చ్చే విమానాల్లో ప్ర‌యాణికుల‌కు ఈ టెస్ట్‌ను త‌ప్ప‌నిస‌రి చేశారు. 

దీనికి వీలుగా విమానాశ్రయాలలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సంబంధిత రాష్ట్ర / యుటి ప్రభుత్వాలను విడిగా కోరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది."ఆర్టి పిసిఆర్ పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులకు విమానాశ్రయాలలో కూడా తగిన ఏర్పాట్లు చేయవచ్చు" అని ఎం‌ఓ‌సి‌ఏ తెలిపింది.

also read స్టాక్ మార్కెట్ పై కరోనా ప్రభావం: సెన్సెక్స్-నిఫ్టీ క్రాష్.. ఫార్మా షేర్లు జోరు.. ...

యు.కెలో కరోనా వైరస్ పరివర్తన చెందిన వేరియంట్ ఆవిర్భావం గురించి ప్రస్తావిస్తూ, కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ ఈ విషయంపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రియా, ఐర్లాండ్, బల్గేరియా దేశాలు యూ.‌కే విమాన ప్రయాణికులపై ఆంక్షలు ప్రకటించిన కొన్ని గంటల తరువాత బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త కరోనా వైరస్ కారణంగా 
 దక్షిణ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ షాపింగ్, సమావేశాలను రద్దు చేయాలని ప్రకటించారు.

కొద్దిరోజుల క్రితం నుండి లండన్, దక్షిణ ఇంగ్లాండ్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వైరస్ ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కంటే 70 శాతం వేగంగా వ్యాప్తి చెందగల వైరస్ అని బోరిస్ జాన్సన్ శనివారం చెప్పారు. కానీ ఇది మరింత ప్రాణాంతకం లేదా మరింత తీవ్రమైన అనారోగ్యానికి సూచించే ఎటువంటి ఆధారాలు లేవు అలాగే ఈ వైరస్ పై వ్యతిరేకంగా వాక్సిన్ తక్కువ ప్రభావవంతంగా ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు.

అంతర్జాతీయ ప్రయాణల గురించి చర్చించడానికి బోరిస్ జాన్సన్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు.