ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు వినూత్నమైన ఆఫర్‌ను ప్రకటించింది. ఎవరైనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి 10,000 డాలర్లను ఖర్చుల కింద ఇస్తామని తెలిపింది.

దీని వెనుక  అమెజాన్ వ్యాపార విస్తరణ లక్ష్యంగా కూడా దాగి వుంది. ఇప్పటి వరకు యూపీఎస్, పోస్టాఫీసులు, కొరియర్లపై అమెజాన్ ఆధారపడివుంది. దీని వల్ల జరిగే ఆలస్యాన్ని తగ్గించడంతో పాటు సమయాన్ని, డబ్బు వృథాను అడ్డుకోవడమే ఈ కాన్సెప్ట్.

ఏంటీ ఈ పథకం:

ఈ పథకం కింద రాజీనామా చేసిన ఉద్యోగులు ఎవరైనా తన ఉద్యోగానికి రాజీనామా చేసి డెలివరీ ఏజెన్సీని ప్రారంభిస్తే వారికి 10,000 డాలర్లతో పాటు మూడు నెలల వేతనాన్ని ఖర్చుల కింద చెల్లిస్తుంది. అలా రాజీనామా చేసిన ఉద్యోగి నీలిరంగు వ్యాన్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

దీనిపై అమెజాన్ లోగోను పెట్టుకోవాల్సి వుంటుంది. ఈ పథకం సంస్ధలోని పార్ట్‌టైమ్, ఫుల్ టైమ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇది కార్యరూపం దాల్చితే అమెజాన్‌కు వాహనాలు, అదనపు ఉద్యోగుల భారం తగ్గడంతో పాటు ఆర్డర్ డెలివరీ సమయాన్ని రెండు రోజుల నుంచి ఒక్కరోజుకు తగ్గుతుంది.