Asianet News TeluguAsianet News Telugu

అమెజాన్ సి‌ఈ‌ఓ మాజీ భార్య రెండో వివాహం.. సంతోషాన్ని వ్యక్తం చేసిన జెఫ్ బెజోస్..

ప్రపంచ మహిళా ధనవంతుల్లో ఒకరైన అమెజాన్‌ షేర్‌ హోల్డర్‌ మెకాంజీ స్కాట్ సీటెల్‌కు చెందిన టీచర్‌ డాన్‌ జెవెట్‌ను పెల్లడినట్లు ఒక ఆంగ్ల పత్రిక  వెల్లడించింది.  

amazon ceo Jeff Bezos ex-wife MacKenzie Scott marries school teacher
Author
Hyderabad, First Published Mar 8, 2021, 2:25 PM IST

అమెజాన్ వ్యవస్థాపకుడు, సి‌ఈ‌ఓ  జెఫ్ బెజోస్  మాజీ భార్య మాకెంజీ స్కాట్ సీటెల్ సైన్స్ ఉపాధ్యాయుడిని రెండో వివాహం చేసుకుంది.  ప్రపంచ మహిళా ధనవంతుల్లో ఒకరైన అమెజాన్‌ షేర్‌ హోల్డర్‌ మెకాంజీ స్కాట్ సీటెల్‌కు చెందిన టీచర్‌ డాన్‌ జెవెట్‌ను పెల్లడినట్లు ఒక ఆంగ్ల పత్రిక  వెల్లడించింది.

 అదే విధంగా డాన్‌ జెవెట్‌ సైతం మెకాంజీకి సంబంధించిన వెబ్‌సైట్ ద్వారా కూడా ధ్రువీకరించారు. ‘అత్యంత దయనీయురాలు, కరుణామూర్తి అయిన మహిళను నేను పెళ్లి చేసుకున్నాను. అంతేకాదు తన సంపద  నుండి విరాళం చేసే విషయంలో తను ఎంతో నిబద్ధతగా నెరవేరుస్తున్న బాధ్యతల్లో భాగం కాబోతున్నాను’’ అంటూ  డాన్‌ జెవెట్‌ పేర్కొన్నారు.

డాన్‌ జ్యువెట్ దశాబ్దాలుగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.  ఇటీవల మాకెంజీ స్కాట్ పిల్లలు హాజరైన ప్రైవేట్ లేక్‌సైడ్ స్కూల్ లో కెమిస్ట్రీ బోధించాడు. ఈ నేపథ్యంలో మెకాంజీ రెండో వివాహంపై స్పందించిన  జెఫ్ బెజోస్ ‘‘డాన్‌ జెవెట్‌  చాలా గొప్ప మనసు ఉన్న వ్యక్తి. వాళ్లిద్దరు తీసుకున్న నిర్ణయం పట్ల నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ హర్షం వ్యక్తం చేశారు.

also read వుమెన్స్ డే సందర్భంగా మహిళల కోసం ఒక కొత్త ప్లాట్‌ఫాం ఆవిష్కరించిన నీతా అంబానీ.. ...

25 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ  జెఫ్ బెజోస్‌- మెకాంజీ స్కాట్ 2019లో  విడాకులు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటన విడుదల చేశారు. మేము భార్యాభర్తలుగా విడిపోయి స్నేహితులుగా కొనసాగుతామని తెలిపారు.  జెఫ్ బెజోస్‌  ఉమ్మడి వెంచర్లు, ప్రాజెక్టుల్లో ఎప్పటిలాగే మేము భాగస్వాములుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

ఈ విడాకుల ఒప్పందంలో భాగంగా 37 బిలియన్‌ డాలర్ల(దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు) విలువ కలిగిన 19.7 మిలియన్‌ అమెజాన్‌ షేర్లను జెఫ్‌ బెజోస్,‌ మెకాంజీ పేరిట బదలాయించినట్లు అప్పట్లో వార్తలు వెలువడ్డాయి.  కాగా 50 ఏళ్ల మెకాంజీ, సామాజిక సేవలో భాగంగా గతేడాది 6 బిలియన్‌ డాలర్ల సంపదను దానం చేసి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇప్పటికీ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. కాగా బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం మెకాంజీ ప్రస్తుత సందప 53.5 బిలియన్‌ డాలర్లు.

క్రానికల్ ఆఫ్ ఫిలాంత్రోపీ వార్షిక ర్యాంకింగ్స్ ప్రకారం గత సంవత్సరంలో స్వచ్ఛంద సంస్థలకు అత్యధికంగా  విరాళం ఇచ్చిన 50 మంది అమెరికన్లలో ఆమె 2వ స్థానంలో నిలిచింది. బెజోస్ ఎర్త్ ఫండ్‌ను ప్రారంభించడానికి 10 బిలియన్ డాలర్లను విరాళంగా ఇవ్వడం ద్వారా బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios