ఈ ఫెసిలిటీస్ అన్ని ఫ్రీ.. మీరు రైలులో ప్రయాణించేటప్పుడు అస్సలు మర్చిపోవద్దు

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు చాలా మంది ప్రయాణికులు రాత్రి 10 గంటలు అవగానే దుప్పట్లు తీసి నిద్రపోతారు. అలాగే, రాత్రిపూట స్టేషన్‌కు చేరుకోవాల్సిన ప్రయాణికులు కూడా ఉంటారు. ఈ ఆందోళన కారణంగా వారు రాత్రంతా మేల్కొని, ఎప్పటికప్పుడు టైం చెక్ చేస్తూ స్టేషన్‌కు చేరుకోగానే  రైలు ఆగినప్పుడు దిగుతారు.

All these facilities are free.. Don't forget to use them next time you travel by train!-SAK

భారతీయ రైల్వే ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ట్రైన్ ప్రయాణంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురుకాకూడదు. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు ఎన్నో సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తుంది.

రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, చాలా మంది ప్రయాణికులు రాత్రి 10 గంటలు అవగానే దుప్పట్లు తీసి నిద్రపోతారు. రాత్రిపూట స్టేషన్‌కు చేరుకోవాల్సిన మరికొందరు ప్రయాణికులు కూడా ఉంటారు. అలాంటివారు స్టేషన్ ఎప్పుడొస్తుందా అన్న ఆందోళనతో రాత్రంతా మేల్కొంటారు. ఎప్పటికప్పుడు టైం చెక్ చేస్తూ స్టేషన్‌కు చేరుకోగానే రైలు ఆగినప్పుడు దిగుతారు.

ఇలాంటి ప్రయాణికుల సౌకర్యార్థం ఇండియన్ రైల్వేస్.. రైల్వే మాన్యువల్‌లో ఒక నిబంధనను రూపొందించింది. దీని కింద రాత్రిపూట దిగే స్టేషన్‌కి చేరుకునే ముందు ప్రయాణికులను మేల్కొల్పడం TT బాధ్యత. 

రైల్వే ఉద్యోగులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. అలా చేయని పక్షంలో రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నిబంధన కేవలం ఏసీలో ప్రయాణించే ప్రయాణికులకు మాత్రమే అని రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార & ప్రచార డైరెక్టర్ తెలిపారు.

కానీ, పబ్లిక్ & స్లీపర్స్ కోసం కాదు. భారతీయ రైల్వే మాన్యువల్ ప్రకారం, రాజధాని, తేజస్, దురంతో లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌లో ఈ సౌకర్యం ఉంది. ఈ రైళ్లలో ఆయా కోచ్‌ల ప్రయాణికులు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య దిగాల్సిన స్టేషన్ వస్తే.. దానికి 15 నిమిషాల ముందుగానే TT నిద్రలేపాలి. ఈ ప్రయోజనం కోసం భారతీయ రైల్వే ప్రతి TTకి 'వేక్ అప్' మెమోను కూడా జారీ చేస్తుంది. 

TT టిక్కెట్‌ను చెక్ చేస్తున్నప్పుడు ప్రయాణికుడికి ఏ స్టేషన్‌, ఏ సమయంలో చేరుకుంటారో తెలుస్తుంది. దీని ప్రకారం, మెమోలో ప్రయాణికుల పేరు, సీటు నంబర్ రాయాలి. స్టేషన్‌కు చేరుకునే ముందు TT సహాయకుడిని పంపాలి.. అలాగే రాబోయే స్టేషన్ గురించి తెలియజేయాలి. ఇందులో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios