Asianet News TeluguAsianet News Telugu

అంబుజా, ACC సిమెంట్స్ ఇక అదానీ గ్రూప్ హస్తగతం, దేశంలోనే అతి పెద్ద సిమెంట్ బ్రాండ్‌గా Adani Cement

ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీ తన వ్యాపార విస్తరణ వేగం పెంచేశారు. ఇప్పటికే పోర్టులు, విమానాశ్రయ రంగంలో దూసుకెళ్తున్న అదానీ గ్రూపు ఎఫ్ఎంసీజీ రంగంలో కూడా రాణిస్తోంది. ఇక తాజాగా దేశీయ సిమెంట్ బ్రాండ్స్ అంబుజా, ఏసీసీ సిమెంట్స్ లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడం ద్వారా అదానీ సిమెంట్స్ దేశంలోనే ప్రముఖ సిమెంట్ బ్రాండ్ గా అవతరించబోతోంది.

adani to buy holcim stake in ambuja cements and acc for 10 5 billion dollar
Author
Hyderabad, First Published May 16, 2022, 1:09 PM IST

దేశంలోని రెండు అతిపెద్ద సిమెంట్ కంపెనీలు అంబుజా, ACC సిమెంట్స్ ఇప్పుడు గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్‌ లో చేరాయి. అదానీ గ్రూప్ ఈ రెండు కంపెనీలను స్విస్ కంపెనీ హోల్సిమ్ నుండి కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 10.5 బిలియన్ డాలర్లు అంటే దాదాపు 81 వేల కోట్ల రూపాయలకు జరిగింది. అదానీ గ్రూప్ విదేశీ అనుబంధ సంస్థ ద్వారా ఈ వాటాను కొనుగోలు చేస్తుంది. Holcim అంబుజా సిమెంట్స్‌లో 63.19 శాతం వాటాను, ACCలో 54.3 శాతం వాటాను కలిగి ఉంది. 

ఈ డీల్ ద్వారా అదానీ గ్రూప్, దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్ మెటీరియల్స్ పరిశ్రమ రంగంలో చేసి అతి పెద్ద కొనుగోలుగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అదానీ గ్రూప్ అదానీ సిమెంట్ ఇండస్ట్రీస్ పేరుతో గతేడాది సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది. ఈ ఒప్పందం తర్వాత, అదానీ గ్రూప్ భారతదేశంలో రెండవ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ అవుతుంది. ACC 1 ఆగస్టు 1936న ముంబైలో ప్రారంభమైంది. అంబుజా సిమెంట్‌ను 1983లో నరోత్తమ్ సెఖ్‌సారియా, సురేష్ నియోటియా స్థాపించారు. Holcim కంపెనీ 17 సంవత్సరాల క్రితం భారతదేశంలో వ్యాపారం ప్రారంభించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సిమెంట్ కంపెనీగా పరిగణిస్తారు. 

మనీకంట్రోల్ పోర్టల్ నివేదిక ప్రకారం, అంబుజా ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 31.5MTగా ఉంది. మరో   7MT విస్తరణ ప్రణాళికపై పని చేస్తోంది. ACC అనేది అంబుజా సిమెంట్ అనుబంధ సంస్థగా ఉంది. ACC ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యం 34MT, కాగా ఇది ప్రస్తుతం అనేక ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. ప్రస్తుతం రెండింటి  ఉత్పత్తి సామర్థ్యం 66MTగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కొనసాగుతున్న విస్తరణ ప్రణాళిక పూర్తయిన తర్వాత ఈ సామర్థ్యం 78MTకి పెరుగుతుంది.

అంబుజా సిమెంట్స్ ACC అద్భుతమైన తయారీ, స్లపై చెయిన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కలిగి ఉన్న భారతదేశంలోని బలమైన బ్రాండ్‌లలో ఒకటి. రెండు కంపెనీలకు ప్రస్తుతం 23 సిమెంట్ ప్లాంట్లు, 14 గ్రైండింగ్ స్టేషన్లు, 80 రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 50,000 కంటే ఎక్కువ ఛానెల్ భాగస్వాములు ఉన్నాయి. అంబుజా సిమెంట్, ACC రెండూ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్టెడ్ కంపెనీలు. శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో అంబుజా సిమెంట్‌ షేరు 4 శాతం నష్టపోయి రూ.358.30 వద్ద ముగిసింది. అదేవిధంగా శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో ఏసీసీ సిమెంట్‌ షేరు 3.50  శాతం పతనంతో రూ.2,102.15 వద్ద ముగిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios