Asianet News TeluguAsianet News Telugu

అదానీ గ్రూప్ చేతికి గంగవరం పోర్టు.. ఈక్విటీలో 31.5 వాటా.. డీల్‌ విలువ రూ.1,954 కోట్లు

అదానీ గ్రూపు కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజడ్‌ఎల్‌) తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంగవరం పోర్టు ఈక్విటీలో 31.5 శాతం కొనుగోలు చేసింది. 

Adani group will take control of Indias second-busiest airport of Mumbai
Author
Hyderabad, First Published Mar 4, 2021, 2:16 PM IST

ముంబై: భారతదేశపు రెండవ అత్యంత రద్దీగా ఉండే ముంబై విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ తన ఆధీనంలోకి తీసుకుంది. అదానీ గ్రూపు కంపెనీ అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌

ఎకనామిక్‌ జోన్స్‌ లిమిటెడ్‌ (ఏపీఎ్‌సఈజడ్‌ఎల్‌) తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గంగవరం పోర్టు ఈక్విటీలో 31.5 శాతం కొనుగోలు చేసింది. ప్రముఖ పీఈ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌ అనుబంధ సంస్థ విండీ లేక్‌సైడ్‌ ఇన్వె్‌స్టమెంట్స్‌ నుంచి అదానీ పోర్ట్స్‌ ఈ వాటాను రూ.1,954 కోట్లకు కొనుగోలు చేసింది. రెగ్యులేటరీ సంస్థలు ఆమోదంతో ఈ ఒప్పందం అమల్లోకి రానుంది. 

also read నేడు భారీ పతనంతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 744 పాయింట్లు డౌన్.. ...

 విశాఖ సమపంలోని గంగవరం పోర్టును రాష్ట్రానికి చెందిన డీవీఎస్‌ రాజు  దీనిని ప్రమోట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యుల చేతిలో 58.1 శాతం వాటా ఉంది. అదానీ గ్రూపు ఈ వాటా కొనుగోలు కోసం కూడా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

ఈ చర్చలు ఫలిస్తే ఆంధ్ర ప్రదేశ్‌లోని రెండు ప్రధాన పోర్టులు  కృష్ణపట్నం, గంగవరం అదానీల చేతిలోకి వస్తాయి. వీటికి తోడు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొన్ని కొత్త పోర్టుల నిర్మాణానికి అదానీ గ్రూపు ఆసక్తి చూపిస్తోంది.

గంగవరం పోర్టు తదుపరి అభివృద్ధిలో అదానీ గ్రూపు భాగస్వామ్యం కోసం ఎదురు చూస్తున్నామని కంపెనీ చైర్మన్‌ డీవీఎస్‌ రాజు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios