అదానీ గ్రూప్ షాకింగ్ నిర్ణయం, 20 వేల కోట్ల విలువైన FPO రద్దు, ఇన్వెస్టర్లకు డబ్బు తిరిగి ఇస్తామని ప్రకటన
రోజంతా కంపెనీ స్టాక్ ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని అన్నారు. ఈ అసాధారణ పరిస్థితుల కారణంగా, FPO ప్రక్రియను కొనసాగించడం నైతికంగా సరైనది కాదని కంపెనీ బోర్డు నిర్ణయించింది. మాకు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఏదైనా ఆర్థిక నష్టం నుండి వారిని రక్షించడానికి, FPO కొనసాగించకూడదని బోర్డు నిర్ణయించినట్లు అదానీ తెలిపారు.

అదానీ గ్రూప్ తన FPOని రద్దు చేసింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, మార్కెట్‌లో అస్థిరతను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ బోర్డు ఎఫ్‌పిఓను రద్దు చేయాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. స్టాక్ మార్కెట్‌లో హెచ్చు తగ్గులను దృష్టిలో ఉంచుకుని తమ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించడమే తమ సంస్థ లక్ష్యమని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. అందుకే మేము FPO నుండి అందుకున్న మొత్తాన్ని తిరిగి ఇవ్వబోతున్నామని తెలిపారు.
బుధవారం, అదానీ గ్రూప్ ఛైర్మన్ కంపెనీ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ, "మా FPOకి మీ మద్దతు , నిబద్ధత తెలియజేసినందుకు పెట్టుబడిదారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము, FPO సబ్ స్క్రిప్షన్ మంగళవారం విజయవంతంగా ముగిసింది. గత వారంలో అస్థిరత ఉన్నప్పటికీ కంపెనీ, దాని వ్యాపారం , దాని నిర్వహణపై ఇన్వెస్టర్ల విశ్వాసం చాలా భరోసానిచ్చింది.అందుకు ధన్యవాదాలు." అని అదానీ తెలిపారు.
ఈ సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ఈరోజు మార్కెట్‌లో అపూర్వమైన కదలిక వచ్చిందని, రోజంతా కంపెనీ స్టాక్ ధరలు హెచ్చుతగ్గులకు గురవుతున్నాయని అన్నారు. ఈ అసాధారణ పరిస్థితుల కారణంగా, FPO ప్రక్రియను కొనసాగించడం నైతికంగా సరైనది కాదని కంపెనీ బోర్డు నిర్ణయించింది. మాకు, పెట్టుబడిదారుల ప్రయోజనాలు చాలా ముఖ్యమైనది, కాబట్టి ఏదైనా ఆర్థిక నష్టం నుండి వారిని రక్షించడానికి, FPO కొనసాగించకూడదని బోర్డు నిర్ణయించినట్లు అదానీ తెలిపారు.
మేము అందుకున్న FPO మొత్తాన్ని వాపసు చేయడానికి మా బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్ (BRLMs)తో కలిసి పనిచేస్తున్నామని అదానీ తెలిపారు. ఇది కాకుండా, పెట్టుబడిదారుల బ్యాంక్ ఖాతాలలోని బ్లాక్ మొత్తాన్ని విడుదల చేయడానికి కూడా కంపెనీ కసరత్తు చేస్తోందని తెలిపారు.
మా బ్యాలెన్స్ షీట్ బలమైన నగదు ప్రవాహాలు , సురక్షిత ఆస్తులతో బలంగా ఉంది
బలమైన నగదు ప్రవాహం , సురక్షిత ఆస్తులతో మా బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా ఉందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ పెట్టుబడిదారులకు భరోసా ఇచ్చారు. మా రుణాలకు సర్వీసింగ్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. గౌతమ్ అదానీ ప్రకారం, FPO రద్దు నిర్ణయం కంపెనీ ప్రస్తుత కార్యకలాపాలు , భవిష్యత్తు ప్రణాళికలపై ఎటువంటి ప్రభావం చూపదన్నారు. దీర్ఘకాలిక విలువల సృష్టికి కృషి చేస్తూనే ఉంటామని, అంతర్గత వనరుల ద్వారానే మా ఎదుగుదల కొనసాగుతుందని ఆయన అన్నారు.
స్టాక్ మార్కెట్ స్థిరమైన తర్వాత, మా క్యాపిటల్ మార్కెట్ వ్యూహాన్ని సమీక్షిస్తామని గౌతమ్ అదానీ చెప్పారు. మా కంపెనీ మీ నమ్మకాన్ని పొందేలా కొనసాగుతుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామని అదానీ తెలిపారు.