బ్యాంకు అక్కౌంట్ తెరవడం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని చోట్లా పాన్ కార్డునే వినియోగిస్తున్నారు. అయితే పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం కూడా చాలా ముఖ్యం, దీనికి చివరి తేదీ మార్చి 31. 

మన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి. అది మన డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, రేషన్ కార్డు అయినా సరే మరేదైనా సరే. మనకు ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి అవసరం. అలాంటి డాక్యుమెంట్స్ లో ముఖ్యమైనది ఒకటి పాన్ కార్డ్. బ్యాంకు అక్కౌంట్ తెరవడం నుంచి ఆర్థిక లావాదేవీల వరకు అన్ని చోట్లా పాన్ కార్డునే వినియోగిస్తున్నారు. అయితే పాన్ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడం కూడా చాలా ముఖ్యం, దీనికి చివరి తేదీ మార్చి 31. ఈ తేదీలోగా పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం తప్పనిసరి లేకుంటే ఆదాయపు పన్ను చట్టం, 1961లో జోడించిన సెక్షన్ 234హెచ్‌తో పాన్ ఆధార్‌లను లింక్ చేయనందుకు అదనంగా రూ. 1,000 జరిమానా విధించబడుతుంది. కాబట్టి పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో ఎలా లింక్ చేయాలో తెలుసుకోండి..

పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడం ఎలా:-

స్టెప్ 1
మీ పాన్ కార్డ్‌ను ఆధార్ కార్డ్‌తో లింక్ చేయడానికి మీరు ముందుగా ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

స్టెప్ 2
మీరు ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లినప్పుడు, మీకు ఎడమ వైపున క్విక్ లింక్‌ల ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఇక్కడకు వెళ్లి లింక్ ఆధార్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

స్టెప్ 3
లింక్ ఆధార్ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత మీరు పాన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఇంకా మీ పూర్తి పేరు వంటి అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసి రిజిస్టర్ చేయాలి.

స్టెప్ 4
దీని తర్వాత మీ ఆధర్ తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌కు వన్ టైమ్ పాస్‌వర్డ్ అంటే OTP వస్తుంది. ఈ OTPని ఎంటర్ చేసి ఆపై సబ్మిట్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్‌తో లింక్ చేయబడుతుంది.