రియల్ బిచ్చగాడు..రూ. 40 వేల కోట్ల ఆస్తులు వదిలేసి భిక్షాటన చేస్తున్న శ్రీమంతుడు.
గౌతమ బుద్ధుడు రాజ్యాన్ని, సుఖాలను విడిచిపెట్టి సన్మార్గంలో నడిచేందుకు అడవులకు వెళ్లిపోయాడు. ఇప్పుడు ఆయన తరహాలోనే బుద్ధుని అనుచరుడైన వెన్ అజన్ సిరిపానో అనే బిలియనీర్ తన కోట్ల సంపాదన కాదని బౌద్ధ మతం స్వీకరించి సన్యాసిగా మారిపోయాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
బిచ్చగాడు సినిమాలో తన తల్లి కోసం 40 రోజులపాటు ఓ ఆగర్భ శ్రీమంతుడు బిక్షగాడిగా మారిన కథను మనందరం చూసాం. కానీ నిజ జీవితంలో అలా జరగడం కుదరదు అని మనందరం కొట్టి పారేస్తూ ఉంటాము. కానీ ఓ వ్యక్తిని చూస్తే మాత్రం అంతకుమించి అని అనడం ఖాయం. 40 వేల కోట్ల ఆస్తులు వదిలి సన్యాసం స్వీకరించడం అంత తేలికైన విషయం కాదు. అజన్ సిరిపానో ఈ విషయంలో ప్రత్యేకంగా నిలుస్తాడు. 18 ఏళ్ల వయసులో తన 40,000 కోట్ల ఆస్తిని వదులుకుని బౌద్ధ సన్యాసిగా మారి 20 ఏళ్లుగా అడవుల్లోనే జీవిస్తున్నాడు.
సిరిపన్యో శ్రీలంక తమిళ సంతతికి చెందిన టెలికాం వ్యాపారవేత్త ఆనంద్ కృష్ణన్ కుటుంబానికి చెందినవారు. అతని తండ్రి ఆనంద్ కృష్ణన్. కృష్ణన్ మెగా బిలియన్ డాలర్ల టెలికాం సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నారు. కృష్ణన్ సామ్రాజ్యంలో టెలికాం పరిశ్రమ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, రియల్ ఎస్టేట్, శాటిలైట్ వ్యాపారం ఉన్నాయి. కృష్ణన్‌కు కనీసం 9 ప్రధాన కంపెనీల్లో వాటా ఉంది. కృష్ణన్ మలేషియాలో మూడవ అత్యంత సంపన్నుడు. ఆనంద్ కృష్ణన్ మ్యాక్సిస్ బెర్హాల్ కంపెనీ యజమాని. ఈ కంపెనీ 2006లో, Maxis 74 శాతం వాటాను కొనుగోలు చేసి మన దేశంలో నడుస్తున్న Aircel యాజమాన్యం సైతం సొంతం చేసుకుంది. అయితే ఇది అనేక వివాదాలకు దారి తీసి ఎయిర్‌సెల్ దివాలా తీసింది. ఆనంద కృష్ణన్, టెలికమ్యూనికేషన్స్ పరిశ్రమలో ప్రముఖ వ్యక్తి, అతని ఆస్తుల విలువ రూ. 40,000 కోట్ల (5 బిలియన్ డాలర్ల ) కంటే ఎక్కువ సంపదను కలిగి ఉన్నారు.
ఆనంద కృష్ణన్ బౌద్ధమతాన్ని నమ్మేవారు. అతని కుమారుడు సిరిపన్యో 18 సంవత్సరాల వయస్సులో బౌద్ధ సన్యాసి కావాలని నిర్ణయించుకున్నాడు. సన్యాసిగా మారడానికి సిరిపన్యో కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. మొదట్లో సిరిపన్యో సరదా కోసం సన్యాసి జీవితాన్ని స్వీకరించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాత్కాలిక సన్యాసి అంటూ వెక్కిరించారు. కానీ సిరిపన్యో మాత్రం, తండ్రికి కోట్లాది రూపాయల ఆస్తులున్నా.. సిరిపన్యో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నాడు.
వెన్ అజన్ సిరిపన్యో రెండు దశాబ్దాలకు పైగా అడవులలో సన్యాసి జీవితాన్ని గడిపినట్లు చెబుతారు. అతను థాయ్‌లాండ్‌లోని డేటావో దమ్ మొనాస్టరీకి మఠాధిపతి కూడా. వెన్ అజన్ సిరిపన్యో తన తల్లి వైపు థాయ్ రాజకుటుంబానికి చెందినవాడని ప్రజలు నమ్ముతారు. వెన్ అజన్ సిరిపన్యో ప్రారంభ జీవితం అతని సన్యాస జీవితం కంటే తక్కువ ప్రసిద్ధి చెందింది. వారి విద్యాభ్యాసం గురించి సరైన సమాచారం లేదు. అతనికి బ్రిటన్‌లో ఇద్దరు చెల్లెళ్లు ఉన్నట్లు సమాచారం. వారితోనే బాల్యం గడిచిందని మీడియా తెలిసింది. సిరిపన్యోకు 8 భాషల్లో ప్రావిణ్యం ఉంది. అనర్గళంగా మాట్లాడగలరు.