2000 Notes: రూ. 2000 నోటు ఉపసంహరణకు వారం పూర్తి.. ఎన్ని నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయో తెలిస్తే షాకే..

దేశంలో 2000 రూపాయల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయానికి ఒక వారం రోజులు గడిచిపోయాయి. ఈ వారం రోజుల్లో ఎన్ని నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. ఇంకా ఎన్ని నోట్లు రావాల్సి ఉంది. అనే అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

2000 Notes It  is been a week since the withdrawal of 2000 notes MKA

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ నుంచి ఒకసారిగా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది అయితే ఇది రద్దు కాదని 2000 రూపాయల నోట్లు చలామణిలోనే ఉంటాయని కానీ ఈ నెల సెప్టెంబర్ లోగా బ్యాంకుల్లో నోట్లను మార్చుకోవాలని ప్రకటించింది దీంతో జనం పెద్ద ఎత్తున 2000 రూపాయల నోట్లతో బ్యాంకులకు వెళ్లి మార్చుకుంటున్నారు.  అయితే ఒక రోజుకు 20వేల రూపాయలు విలువైన 2000 నోట్లు మాత్రమే మార్చుకోవాలని ఆర్బిఐ తన నిబంధనల్లో పేర్కొంది

2 వేల రూపాయల నోటు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్న వారం తర్వాత ఇప్పటి వరకూ రూ. 36,492 కోట్లు విలువైన నోట్లు బ్యాంకులకు వచ్చి చేరాయి. ఈ వారంలో బ్యాంకుల్లో సుమారు రూ.36 వేల కోట్లకు పైగా డిపాజిట్లు వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.  

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ 30 లోగా రూ.2 వేల నోట్లను డిపాజిట్ చేసుకోవాలని బ్యాంకులను కోరింది. అయితే  ఇప్పటి వరకు చాలా మంది బ్యాంకుల్లో నోట్ల మార్పిడికి మొగ్గు చూపడం విశేషం.

తాజా RBI డేటా ప్రకారం, 26 మే 2023 నాటికి చెలామణిలో ఉన్న కరెన్సీ రూ. 34.4 లక్షల కోట్లు ఉన్నాయి. వీటిలో రూ. 36,492 కోట్లు తగ్గింది. బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ మాట్లాడుతూ, బ్యాంకులకు 2000 నోట్ల రూపంలో 36 వేల కోట్ల రూపాయలు తిరిగి వచ్చినట్లు చెబుతున్నారు. 

50 వేల నుంచి రూ. 1 లక్ష కోట్లు బ్యాంకులకు తిరిగి వస్తుందని అంచనా 
బ్యాంకింగ్ వ్యవస్థలోకి పెద్ద సంఖ్యలో రూ.2000 నోట్లు తిరిగి వస్తున్నాయి. రూ.3.6 లక్షల కోట్ల నుంచి రూ.50 వేల కోట్ల నుంచి రూ.1 లక్ష కోట్లు చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు మరి కొన్ని వారాల్లో తిరిగి వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే వారం రోజుల్లోనే 36 వేల కోట్లకు పైగా కరెన్సీ తిరిగి రావడం ద్వారా ఆర్బీఐ నిర్దేశించిన లక్ష్యం సెప్టెంబరు కన్నా చాలా ముందే పూర్తయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  

నోట్లు వేగంగా వస్తున్నాయి 
తొలి వారంలోనే ఇంత పెద్ద మొత్తంలో నోట్లు వచ్చాయంటే, రూ.2000 నోట్లు వేగంగా బ్యాంకుల్లోకి వస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఆర్థికవేత్త అభిషేక్ బారువా తెలిపారు. రెండు పెద్ద బ్యాంకులకు 32 వేల కోట్ల రూపాయలు వచ్చినట్లు తెలుస్తోంది.  రూ.2000 నోట్లకు సంబంధించి బ్యాంకుకు రూ.14,000 కోట్లు వచ్చినట్లు ఎస్ బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తెలిపారు. అదే సమయంలో 3 వేల కోట్ల రూపాయల మార్పిడి జరిగిందని ఆయన ఇటీవల ప్రకటించారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios