ఈ 10 సినిమాలు చూస్తే స్టాక్ మార్కెట్‌లో మీరే కింగ్
స్టాక్ మార్కెట్ అంటే మనలో చాలా మందికి అర్థం కాని ఓ పెద్ద ప్రశ్న కదా? అయితే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడితే బాగా డబ్బులొస్తాయని కొందరు, లేదు చాలా నష్టాలొస్తాయని మరికొందరు చెబుతుంటారు. దీంతో రిస్క్ ఎందుకని అసలు స్టాక్ మార్కెట్ జోలికే మనలో చాలామంది వెళ్లరు. అయితే ఈ 10 సినిమాలు చూస్తే మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ట్రేడింగ్ ఎలా చేయాలి? ఫ్రాండ్ ఎలా జరుగుతుంది? నష్టాల నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? లాభాలు సంపాదించేలా ట్రేడింగ్ ఎలా చేయాలి లాంటి అనేక విషయాలు తెలుస్తాయి. దీంతో మీరు స్టాక్ మార్కెట్లో కింగ్ అయిపోవచ్చు. ఆ సినిమాల విశేషాలు ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం.
స్టాక్ మార్కెట్ అనేది ఒక ఫైనాన్షియల్ ప్లాట్ ఫాం. ఇందులో కంపెనీలు తమ షేర్లను బోర్డు ద్వారా అమ్ముతాయి. ఇక్కడ ప్రజలు ఈ షేర్లను కొనుక్కొని ఆ కంపెనీ పార్టనర్ షిప్ పొందుతారు. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా కంపెనీలు పెట్టుబడులు సంపాదిస్తాయి. వాటిని కంపెనీల ప్రగతికి ఉపయోగించి వచ్చిన లాభాలను షేర్ హోల్డర్స్ అందరికీ ఇస్తాయి. దీని ద్వారా ఆ కంపెనీ షేర్స్ కొన్న వారందరూ లాభపడతారు. అయితే స్టాక్ మార్కెట్ లో ఫ్రాడ్, ఫేక్ కంపెనీలు కూడా ఉంటాయి. పొరపాటున వాటిల్లో మీరు పెట్టుబడులు పెడితే నష్టపోవాల్సి ఉంటుంది. అందువల్ల ఏ కంపెనీ మంచిది, ఏది ఫ్రాడ్ కంపెనీ, ఎక్కడ పెట్టుబడి పెడితే మనకు లాభాలొస్తాయి. ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఎవరికి వారే వెతుక్కోవాలి. అయితే కొన్ని బ్రోకరైజ్ కంపెనీలు భవిష్యత్తులో జరగబోయే విషయాలపై అంచనాలు వేసి ప్రజలను ఆకర్షిస్తాయి. వారి ద్వారా పెట్టుబడులు పెట్టిస్తాయి. ఇవి కూడా ఎంత వరకు సత్ఫలితాలనిస్తాయని చెప్పలేం. ఈ ప్రశ్నలన్నింటికీ ఈ 10 సినిమాల్లో సమాధానాలు దొరుకుతాయి.
స్టాక్ మార్కెట్ లో రాణించాలంటే విధానాలు
కంపెనీల పరిస్థితిపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ఫైనాన్షియల్ కాలిక్లేషన్స్, సెలక్టెడ్ ప్రాజెక్ట్స్, మార్కెట్ ట్రెండ్స్ పై స్ట్రాంగ్ రీసెర్చ్ అవసరం. ఒకే కంపెనీకి చెందిన షేర్లు కొనుగోలు చేయడం కంటే వివిధ రంగాలకు చెందిన కంపెనీల షేర్లను కొనుగోలు చేయడం ద్వారా రిస్క్ తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ దీర్ఘకాలిక వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి కొనుగోలు చేసిన షేర్లను కొన్ని సంవత్సరాలు ఉంచడం మంచిది. అప్పుడే మీరు లాభాలు పొందగలరు. షేర్స్ కొనుగోలు చేసినప్పుడు ఎంత మేరకు నష్టం వస్తే అమ్మాలి(స్టాప్లాస్) ఎంత మేరకు లాభం వస్తే అమ్మాలి(టార్గెట్) అనే నిర్ణయాలు ముందే తీసుకోవాలి. మార్కెట్ ట్రెండ్స్, ఒడిదొడుకులను గమనించి, అవి ఎలా మారతాయో అర్థం చేసుకొని స్టాక్స్ కొనుగోలు చేయాలి.
స్టాక్ మార్కెట్లో నష్టాలు ఎలా వస్తాయి?
ఆర్థిక సంక్షోభాలు, ప్రభుత్వ విధానాలు, ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటనలు స్టాక్ మార్కెట్ ను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు కరోనా వైరస్ వ్యాప్తి చెందడం స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపింది. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కూడా స్టాక్ మార్కెట్ ను కుదిపేసింది. ఇలా ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా స్టాక్ మార్కెట్ పై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది. అలాంటి వాటిపైనా అంచనా ఉంటేనే ఇందులో రాణించగలుగుతారు. ఒకే కంపెనీ పై ఎక్కువ పెట్టుబడులు పెట్టడం కూడా నష్టాలు చవిచూసేందుకు అవకాశం ఉంటుంది. ఆ కంపెనీ నష్టాలపాలైతే మీరూ తీవ్రంగా నష్టపోతారు. ఒకే కంపెనీపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్ల ఆ కంపెనీ డౌన్‌ఫాల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. మార్కెట్ పై అశ్రద్ధగా, మానసికంగా ప్రభావితమై తీసుకున్న నిర్ణయాలు నష్టాలకు దారితీస్తాయి. అంటే ఎవరో చెప్పారని, ఏదో జరుగుతుందని నిర్ణయాలు తీసుకోకూడదు. నష్టం వచ్చిందని బాధతో, ఆవేశంతో స్టాక్స్ అమ్మేయడం, లేదా కొనడం మంచి నిర్ణయం కాదు. దీని వల్ల వస్తే భారీ లాభాలు, లేకపోతే అదే రేంజ్ లో నష్టాలు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది.
నష్టాలను ఎలా ఎదుర్కోవాలి?
స్టాప్లాస్ ను ఉపయోగించి నిర్ణీత స్థాయిలో నష్టం వచ్చాక షేర్లను అమ్మడం ద్వారా నష్టాలను ఎదుర్కొనవచ్చు. ఒకే రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టకుండా, వివిధ రంగాల్లో వేరే వేరు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టాలు నివారించవచ్చు. మార్కెట్ పరిణామాలను గమనించి, అనుకూలమైన సమయంలో నిర్ణయాలు తీసుకోవడం కూడా నష్టాలు ఎదుర్కొనడానికి ఉపయోగపడతాయి.
స్టాక్ మార్కెట్ లో లాభాలు రావాలంటే ఏమి చేయాలి?
ఊహించి నిర్ణయాలు తీసుకోకూడదు. స్టాక్ మార్కెట్ డేటాను ఆధారంగా చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ట్రెండ్ అనాలిసిస్, కంపెనీ విశ్లేషణ, ఆర్థిక నివేదికలు చదవాలి. షేర్స్ ని ఎక్కువ కాలం ఉంచడం ద్వారా కూడా కచ్చితంగా లాభం పొందవచ్చు. మార్కెట్ మార్పులకు అనుగుణంగా పోర్ట్ ఫోలియో సర్దుబాటు చేసుకోవడం ద్వారా లాభాలు పొందవచ్చు. లాభనష్టాలను లెక్కించుకొని బెస్ట్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల కూడా లాభాలు పొందవచ్చు.
స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకున్న వారు చూడాల్సిన 10 సినిమాలు
1. Wall Street(1987)
ఈ సినిమా స్టాక్ మార్కెట్ లో ఆర్థిక స్వాధీనం, నైతికత, స్టాక్ మార్కెట్ పద్ధతుల గురించి వివరిస్తుంది. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి. నిర్ణయాలు తీసుకునే ముందు నైతికతను మరిచిపోకూడదని తెలియజేస్తుంది.
2. The Wolf of Wall Street(2013)
స్టాక్ మార్కెట్ లో లాభాల కోసం ఫైట్ చేసే ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని వివరిస్తుంది. ఈ సినిమా స్టాక్ మార్కెట్ లో అక్రమాల గురించి, స్వార్థంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే నష్టాల గురించి వివరిస్తుంది.
3. The Big Short(2015)
2008 ఆర్థిక సంక్షోభానికి సంబంధించిన సినిమా ఇది. స్టాక్ మార్కెట్ లో ఉన్న అసలైన అన్ స్టెబిలిటీ, ఆర్థిక సంబంధిత సమస్యలను చాలా క్లియర్ గా చూపిస్తుంది. ఆర్థిక సంక్షోభాలకు ముందు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి. మార్కెట్ లో నిజమైన ప్రమాదాలను అర్థం చేసుకోవడం ఎలాగో ఈ సినిమాలో వివరించారు.
4. Boiler Room(2000)
స్టాక్ మార్కెట్ లో ఇల్లీగల్ ట్రేడింగ్ చేసే ఒక యువకుడి కథ ఇది. దీనివల్ల కలిగే ఇబ్బందులను బాగా చూపించారు. అక్రమ వ్యాపారాల నుంచి దూరంగా ఎలా ఉండాలి, మార్కెట్ లో నిజాయతీగా ఉండటం వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చు వంటి విషయాలను ఈ సినిమాలో వివరించారు.
5. Margin Call(2011)
ఓ ఫైనాన్షియల్ కంపెనీ మార్కెట్ లో ఉన్న ముప్పును తెలుసుకుని తన సంస్థను రక్షించేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో ఈ సినిమాలో బాగా చూపించారు. ముందే ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, కష్టమైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా అన్న విషయాలు ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు.
6. Too Big to Fail(2011)
2008 ఆర్థిక సంక్షోభం గురించి ఈ సినిమాలో చూపించారు. పెద్ద కంపెనీలు విఫలమైన సమయంలో ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయి అన్న విషయాలు కూడా బాగా వివరించారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కంపెనీల ప్రభావం నుంచి ట్రేడర్స్ ఎలా తమ డబ్బును రక్షించుకోవాలన్న విషయాన్ని ఈ సినిమా ద్వారా మనం నేర్చుకోవచ్చు.
7. Rogue Trader(1999)
ఈ సినిమా నిక్ లీసన్ అనే ట్రేడర్ చేసిన పెద్ద తప్పులను వివరిస్తుంది. అలాంటి తప్పులు మనం చేయకూడదని ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు. వ్యక్తిగత భద్రతలోని లోపాలు, కచ్చితమైన నియంత్రణ అవసరమని ఇక్కడ మనం నేర్చుకోవాలి.
8. Inside Job(2010)
2008 ఆర్థిక సంక్షోభానికి కారణమైన సంఘటనలపై ఈ డాక్యుమెంటరీగా తీసిన సినిమా ఇది. ఆర్థిక సంస్కరణలు, సరైన నిబంధనలు పాటించడం చాలా ముఖ్యమని ఈ సినిమా చెబుతుంది.
9. Glengarry Glen Ross(1992)
రియల్ ఎస్టేట్ అమ్మకాలపై ఆధారపడి ఉన్న ఈ సినిమా మార్కెటింగ్, అమ్మకపు వ్యూహాలను చాలా బాగా, అర్థమయ్యేలా చూపిస్తుంది. ట్రేడింగ్ వ్యూహాలు, వాటి ప్రాముఖ్యత మరికొన్ని విషయాలను ఇందులో బాగా చూపించారు.
10. Moneyball(2011)
ఒక బేస్‌బాల్ జట్టు మేనేజర్.. డేటా ఆధారంగా జట్టును ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ చేసిన కథ ఇది. ఈ సినిమా ద్వారా డేటా ఆధారంగా ట్రేడింగ్ చేయడం ఎంత ముఖ్యమో నేర్చుకోవచ్చు.