షియోమీ స్మార్ట్ ఫోన్సే కాదు త్వరలో ఎలక్ట్రిక్ కార్ కూడా వచ్చేస్తోంది.. ఈ పెద్ద కంపెనీతో చర్చలు..

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే రెండేళ్లలో దీనిని పూర్తి చేయడానికి షియోమీ బీజింగ్ హ్యుందాయ్  ప్లాంట్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు యోచిస్తోంది. ఈ ఫ్యాక్టరీకి చైనాలో కార్ల తయారీకి పూర్తి లైసెన్స్ ఉందని నివేదికలో పేర్కొంది. 

Xiaomi is in talks with this big car manufacturer to make an electric car

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమీ ఎలక్ట్రిక్ కారు ప్రొడక్షన్ పెంచేందుకు చైనాలో  ఒక ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా మీడియా నివేదిక ప్రకారం బీజింగ్ ఆటోమోటివ్ గ్రూప్ కో., లిమిటెడ్ షియోమీ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిపై పని చేస్తుంది. అయితే 2024లో సొంతంగా కారును తయారు చేస్తామని కంపెనీ గతంలో హామీ ఇచ్చింది. 

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, రాబోయే రెండేళ్లలో దీనిని పూర్తి చేయడానికి షియోమీ బీజింగ్ హ్యుందాయ్  ప్లాంట్‌లో వాటాను కొనుగోలు చేసేందుకు యోచిస్తోంది. ఈ ఫ్యాక్టరీకి చైనాలో కార్ల తయారీకి పూర్తి లైసెన్స్ ఉందని నివేదికలో పేర్కొంది. ఒప్పందం గురించి తెలిసిన వ్యక్తుల ప్రకారం షియోమీ ప్రొడక్షన్ టై-అప్‌పై దృష్టి సారిస్తోందని అన్నారు. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ప్రస్తుతం కార్ల తయారీకి లైసెన్స్‌లను పొందడంలో జాప్యాన్ని ఎదుర్కొంటోంది. 

బీజింగ్ ఆటోమోటివ్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ బి‌ఏ‌ఐ‌సి బ్లూపార్క్ న్యూ ఎనర్జీ టెక్నాలజీతో షియోమీ భాగస్వామిగా ఉంటుందని నివేదిక తెలిపింది. ప్లాంట్ నంబర్ 2 ప్రస్తుతం కొత్త ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడానికి పూర్తిగా రెడీ కాలేదు. ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ బ్లూపార్క్ కి ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, దీనిని షియోమీ-బి‌ఏ‌ఐ‌సి  వాహనాలను తయారు చేయడానికి ఉపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. 

ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్నప్పటికీ, ఫైనల్ ఒప్పందంకి  చాలా సమయం పట్టోచ్చు.  అయితే భాగస్వామ్యం గురించి షియోమీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. షియోమీ ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి 10 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు లీ జున్ హామీ ఇచ్చారు. షియోమీ గత సంవత్సరం ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఆసక్తిని ప్రకటించింది. కంపెనీ ఈ సంవత్సరం ప్రారంభంలో  మొదటి ఎలక్ట్రిక్ వాహనాల ఫ్యాక్టరీని నిర్మించడం ప్రారంభించింది. ఈ ప్లాంట్ 3 లక్షల యూనిట్ల సామర్ధ్యం ఉంటుందని అంచనా. 

టెక్నాలజి రంగంలో  ఉన్న షియోమీ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ఏకైక సంస్థ కాదు. అమెరికన్ దిగ్గజం ఆపిల్ కూడా 2025 ప్రారంభంలో మొదటి ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, టైటాన్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడంలో కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios